వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి నలుగురిలో ఒకరు ఫేస్‌బుక్ యాప్‌ను డిలీట్ చేశారు..ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

అమెరికాలో ఫేస్‌బుక్ వినియోగిస్తున్నవారిలో మూడోవంతు వినియోగదారులు ఈ సోషల్ మీడియా యాప్‌ను వాడటం లేదు. ఇందుకు కారణం అమెరికాలో పెరిగిన స్కాండల్స్, వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, అమెరికా ఎన్నికల్లో రష్యాలాంటి దేశాలు జోక్యం చేసుకోవడంతో పాటు ద్వేషపూరితమైన కథనాలు ఫేస్‌బుక్‌లో దర్శనమిస్తుండటంతో చాలామంది ఈ యాప్‌కు దూరంగా ఉంటున్నట్లు ఓ సర్వే వెల్లడించింది.

డేటా లీకేజీ: కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్న ఫేస్‌బుక్డేటా లీకేజీ: కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్న ఫేస్‌బుక్

మూడోవంతు అమెరికన్లు ఫేస్‌బుక్‌కు దూరం

మూడోవంతు అమెరికన్లు ఫేస్‌బుక్‌కు దూరం

2016 అమెరికా ఎన్నికల్లో విదేశీ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయన్న కథనాలు ఫేస్‌బుక్‌లో రావడంతో దానిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ సెనేట్ ప్యానెల్ ముందు వివరణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే సంస్థ విడుదల చేసిన సర్వేలో మూడోవంతు ఫేస్ బుక్ వినియోగదారులు యాప్‌కు దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో 74శాతం యువత ప్రైవెసీ సెట్టింగ్స్‌ను మార్చుకోవడం కానీ, ఫేస్‌బుక్‌యాప్‌కు దూరంగా ఉండటం కానీ..లేదా మొత్తానికే అకౌంట్ డిలీట్ చేయడం గానీ చేశారని సర్వే తెలిపింది.

42 శాతం మంది ఫేస్‌బుక్ యాప్‌ను వాడటం లేదు: సర్వే

42 శాతం మంది ఫేస్‌బుక్ యాప్‌ను వాడటం లేదు: సర్వే

అంతేకాదు ఫేస్‌బుక్ వినియోగిస్తున్న నలుగురు అమెరికన్లలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువగా తమ స్మార్ట్ ఫోన్లలోని ఫేస్‌బుక్ యాప్‌ను తొలగించినట్లు సర్వే వెల్లడించింది. 54శాతం మంది ప్రైవసీ సెట్టింగులను మార్చుకోగా... 42శాతం మంది గతకొన్ని వారాలుగా యాప్‌ను వినియోగించడం మానేశారని సర్వే స్పష్టం చేసింది. ప్రైవసీ సెట్టింగ్స్ మార్చిన వారిలో 64శాతం మంది 18 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు వయసున్న వారని సర్వే పేర్కొంది.

 ఫేస్‌బుక్ యాప్‌లోని టూల్స్‌ను మరింత సరళతరం

ఫేస్‌బుక్ యాప్‌లోని టూల్స్‌ను మరింత సరళతరం

ఫేస్ బుక్ వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని యాప్‌లోని ప్రైవసీ కంట్రోల్ ద్వారా ప్రతిరోజు మారుస్తూ ఉంటారని వాషింగ్టన్ పోస్టుకు విడుదల చేసిన ప్రకటనలో యాజమాన్యం తెలిపింది. గత కొన్ని నెలలుగా ఫేస్‌బుక్ యాప్‌లోని టూల్స్‌ను మరింత సరళతరం చేసినట్లు యాజమాన్యం తెలిపింది. తమ విధానాలను మరింత స్పష్టం చేసినట్లు చెప్పిన యాజమాన్యం, సరళతరమైన ప్రైవెసీ సెట్టింగులతో వినియోగదారుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకునేలా ఉంటుందని తెలిపింది.

అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఫేస్‌బుక్

అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఫేస్‌బుక్

వినియోగదారులు చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారాన్ని సులభంగా డిలీట్ కూడా చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం ఫేస్‌బుక్ పేజ్‌పైనే కాకుండా పలు వేదికలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించామని ఫేస్‌బుక్ తెలిపింది. ఇలా చేయడం ద్వారా వినియోగదారుల్లో తమ వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌పై ఎలా మేనేజ్ చేయాలో వివరించామని యాజమాన్యం చెప్పింది.

English summary
Nearly three-quarters of American Facebook users have changed how they use the social media app in the past year, following a barrage of scandals involving the abuse of personal data, foreign interference in U.S. elections and the spread of hateful or harassing content on the platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X