వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలిఫోర్నియాలో దుండగుడి కాల్పులు... నలుగురు మృతి

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

యూంట్‌విల్లే: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న అతిపెద్ద వెటరన్స్‌ హోంలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సాయుధుడైన దుండగుడు ఈ హోంలోని ముగ్గురు మహిళలను కాల్చి చంపాడు. అనంతరం ఆ దుండగుడు కూడా చనిపోయి కనిపించాడని కాలిఫోర్నియా హైవే గస్తీ పోలీసులు తెలిపారు.

చదవండి: అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం, స్నేహితులతో బోటింగ్‌కు వెళ్లి...

మొదట ఆ దుండగుడు ముగ్గురు వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు, దుండగుడికి మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగాయి. తర్వాత హోంలో పరిశీలించి చూడగా దుండగుడు సహా నలుగురు మరణించి కనిపించారు.

అయితే వెటరన్స్ హోం ఉన్న ఆ ముగ్గురు మహిళలనే దుండగుడు ఎందుకు చంపాడనే విషయం తెలియరాలేదు. వారితో దుండగుడికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయం స్పష్టం కాలేదు. దుండగుడి వివరాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Three women, suspect dead after hostage standoff in Yountville, California

ఈ ఘటనలో మరణించిన ముగ్గురు మహిళలు వెటరన్స్‌ హోంలోని పాత్‌వే హోం ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. అమెరికాలోనే అతి పెద్ద వెటరన్స్‌ హోం ఇది. దీన్ని 1984లో ప్రారంభించారు. ఇందులో 1200 సీట్లతో థియేటర్‌, గోల్ఫ్‌ కోర్స్‌, బేస్‌బాల్‌ స్టేడియం, బౌలింగ్‌ లేన్స్‌, స్విమ్మింగ్‌ పూల్‌ తదితర ఎన్నో సదుపాయాలు ఉంటాయి.

ఇందులో వృద్ధులు, వికలాంగులు దాదాపు వెయ్యి మంది ఉంటారని అక్కడి వెటరన్స్‌ అఫైర్స్‌ విభాగం వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం, కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం, ఇరాకీ ఆపరేషన్స్‌ తదితర వాటిల్లో పాల్గొన్న వారు ఈ వెటరన్స్‌ హోంలో ఉంటున్నారు. యుద్ధాల్లో పాల్గొని మానసిక ఒత్తిడితో బాధపడుతున్న సైనికులకు ఈ పాత్‌వే హోంలో కౌన్సిలింగ్‌ ఇస్తారు.

English summary
After an apparent hourslong standoff between police and a gunman, three women were found dead Friday night at the Veterans Home of California in Yountville, authorities said. The suspect was also found dead, Chris Childs, assistant chief of the California Highway Patrol's Golden Gate Division, told reporters. The three victims were earlier described as employees of The Pathway Home, a counseling service for veterans who suffer post-traumatic stress disorder (PTSD), which is on the property. The suspect had been a client at facility until he left two weeks ago, according to State Senator Bill Dodd.It's unclear if the women were chosen at random or had a connection with the gunman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X