వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్రహ్మపుత్ర నీరు రంగు మారడానికి భూకంపమే కారణం: చైనా
బీజింగ్: బ్రహ్మపుత్ర నదీ నీళ్లు రంగు మారడానికి ఇటీవల టిబెట్‌లో 6.9 తీవ్రతతో భూకంపం రావడమే కారణం అని చైనా చెబుతోంది. సియాంగ్ నదీ జలాలు నలుపు రంగులోకి మారడం వెనుక చైనా కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి.
నదీ జలాలు ఎక్కువగా కలుషితం కావడం వల్లే అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నదీ జలాలు రంగు మరాయని కొన్ని మీడియా వర్గాలు చెప్పాయి. దీంతో చైనా స్పందించింది.

నవంబరు నెలలో టిబెట్‌లో భూకంపం సంభవించిందని, ఆ సమయంలో చైనాలో బ్రహ్మపుత్ర నదిలోని నీరు నలుపు రంగులోకి మారిందని వెల్లడించారు.
ఎగువ ప్రాంతంలో చైనా సొరంగ మార్గం పనులు చేపట్టడం వల్లే నదీ జలాలు రంగు మారినట్లు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అధికారులు ఆరోపించారు. ఆ ఆరోపణలను చైనా గతంలోనే ఖండించింది.