జామాత దశమగ్రహం! ట్రంప్ అల్లుడు అదుర్స్ -తండ్రి రిటైర్మెంట్.. కూతురు టిఫనీ ఎంగేజ్మెంట్
'అడుగుపెట్టిన వేళా విశేషం' అంటారు కదా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త అల్లుడి విషయంలోనూ ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. ఘనత వహించిన ట్రంప్ కుటుంబంలోకి అల్లుడి హోదాలో కొత్త వ్యక్తి ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. మన దగ్గరైతే 'జామాత దశమగ్రహం' అనే నానుడి, అల్లుళ్ల కారణంగా పొలిటికల్ కెరీర్ పోగొట్టుకున్న నేతల ఉదంతాలూ ఎన్నో ఉన్నాయి. పెద్దల్లుడు(ఇవాంకా భర్త) జారెడ్ కుష్నర్.. ట్రంప్ పాలనలో మితిమీరిన జోక్యం చేసుకున్నాడనే ఆరోపణ కూడా ఉండనే ఉంది. సరిగ్గా రిటైర్మెంట్ వేళ కొత్తల్లుడి రాక ఖరారైన నేపథ్యంలో.. ఈ మార్పు ట్రంప్ లైఫ్ ను మున్ముందు ఎలా ప్రభావితం చేయబోతోందోనని కథనాలు వెలువడుతున్నాయి. విషయంలోకి వెళితే..

రిటైర్మెంట్.. ఎంగేజ్మెంట్..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌కు ఆఖరి రోజైన జనవరి 20కి ఒక్కరోజు ముందు ఆయన చిన్న కుమార్తె టిఫనీ ట్రంప్ (27) తన ఎంగేజ్మెంట్ విషయాన్ని ప్రకటించింది. తాను మూడేండ్లుగా ప్రేమిస్తున్న.. తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన మైఖేల్ బౌలస్ (23)తో ఎంగేజ్మెంట్ జరిగిందని టిఫనీ ట్రంప్ వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్‌కు, ఆయన రెండో భార్య అయిన మర్లా మాపుల్స్‌కు కలిగిన సంతానమే ఈ టిఫనీ ట్రంప్. మంగళవారం ప్రియుడు మైఖేల్ బౌలోస్‌తో తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంటూ టిఫనీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.

వైట్ హౌస్‌లో చివరి వేడుక ఇదే..
ఇవాళ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో కలిసి వైట్ హౌజ్ లో చేసుకున్న చిట్టచివరి వేడుక కూతురి నిశ్చితార్థమే కావడం గమనార్హం. ‘‘కుటుంబ సభ్యులతో కలిసి వైట్‌హౌస్‌లో నిశ్చితార్థం జరుపుకోవడం సంతోషంగా ఉంది. మైఖేల్‌తో నిశ్చితార్థం నాకెంతో ప్రత్యేకం. ఇంతకన్నా అదృష్టం ఇంకేదీ లేదు. త్వరలో జరగబోయే పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం'' అని టిఫనీ ట్రంప్ ఇన్‌స్టాలో పేర్కొనగా.. ఆమె ప్రియుడు బౌలోస్ కూడా అదే ఫోటోను షేర్ చేస్తూ 'లవ్ యు హనీ' అని కామెంట్ చేశాడు. కాగా..

కొత్త అల్లుడు ధగధగలు..
వైట్ హౌజ్ వేదికగా పెద్దల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుక సందర్భంగా దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 13 క్యారెట్ల ఎమరాల్డ్ కట్ డైమండ్ రింగును టిఫనీ వేలుకు తొడిగాడట మైఖేల్ బౌలోస్. ఈ డైమండ్ రింగ్ విలువ సుమారుగా 1.2 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలు దాదాపు రూ.9 కోట్లు) ఉంటుందని అంచనా. డొనాల్డ్ ట్రంప్, మార్లా మాపుల్స్ ఏకైన సంతానమైన టిఫనీ ట్రంప్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. ‘బ్లాక్ లైఫ్ మ్యాటర్స్' ఉద్యమ సమయంలో తండ్రిని సమర్థించబోయిన టిఫనీ.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే..

బిలియనీర్ అల్లుడు అదుర్స్
ట్రంప్ చిన్నల్లుడు కాబోతోన్న.. టిఫనీ ట్రంప్ ప్రియుడు మైఖేల్ బౌలస్ కూడా బాగా కలిగినవాడే. లండన్‌కు చెందిన వ్యాపారవేత్తగా, బిలియన్ డాలర్ల నైజీరియా సంస్థకు వారసుడైన బౌలస్ లెబనాన్‌లో జన్మించాడు. లండన్ కాలేజీలో చదువుకున్నాడు. టిఫనీ, మైఖేల్ జంట తొలిసారి 2018 జనవరిలో కెమెరా కంటికి చిక్కడంతో వారి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ డేటింగ్ లో ఉన్న ఈ జంట.. తీరా ట్రంప్ రిటైర్ కావడానికి ఒకరోజు ముందు వైట్ హౌజ్ లో ఎంగేజ్మెంట్ చేసుకోవడం గమనార్హం.
షాకింగ్: శశికళకు ఏమైంది? -జైలు నుంచి ఆస్పత్రికి -పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్ -27న విడుదలనగా