వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్ : పులికి మూర్ఛ వ్యాధి... సర్కస్‌లో కలవరం

|
Google Oneindia TeluguNews

రష్యా: సర్కస్‌లో ప్రదర్శన ఇస్తూ ఓ పులి మూర్ఛపోయిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. వీడియో కాస్త వైరల్ అవడంతో జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయానికొస్తే...ఆరేళ్ల వయసున్న జెనా అనే పులి రష్యాలోని ఓ సర్కస్‌లో ఉత్సాహంగా ఫీట్లు చేస్తోంది. ప్రేక్షకులు పులి చేసే ఫీట్లక ఫిదా అయిపోయారు. చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నారు. అంతలోనే ఒక్కసారిగా గ్యాలరీ సైలెంట్ అయిపోయింది.

అన్ని పులులూ రింగ్ మాస్టర్ చెప్పిన ఆదేశాలను పాటిస్తూ వాటికి అప్పగించిన ఫీట్లను చేస్తున్నాయి. ఇక నిప్పు అంటించిన రింగ్ నుంచి పులులు దూకాల్సి ఉంది. అయితే ఈ ఫీట్ ఇతర పులులు చాలా ఈజీగానే చేశాయి కానీ జెనా అనే ఈ పులి మాత్రం కాస్త ఇబ్బంది పడింది. ఒక్కసారిగా నిలిచిపోయింది. ఏమైందో తెలుసుకునేందుకు రింగ్ మాస్టర్ ప్రయత్నించాడు. కానీ అది మాత్రం నీలుక్కుంటూ పోయింది. తీరా అది మూర్ఛ వ్యాధికి గురైందని గ్రహించాడు రింగ్ మాస్టర్.

Tiger suffer from fits while performing task in a circus

మూర్ఛ వ్యాధికి గురైన జెనా అనే ఈ పులికి ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నం చేశాడు. దానిపైకి రెండు బకెట్ల నీర పోశాడు. అంతేకాదు పులిని తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశాడు రింగ్ మాస్టర్. పులి శరీర అవయవాల దగ్గర తాకి దానిని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ పులి మాత్రం చికిత్సకు స్పందించలేదు. మరోవైపు ఇతర పులులు జెనాపై దాడిచేసే అవకాశం ఉంది. జెనాను ఓ వైపు కాపాడుకుంటూనే చికిత్స అందిచాడు రింగ్ మాస్టర్.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరులేని మూగజీవాన్ని హింసించారని ధ్వజమెత్తారు. కానీ రింగ్ మాస్టర్ పులిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంను వారు మెచ్చుకున్నారు. అలాంటి సమయంలో అదే ట్రీట్ మెంట్ చేయాలని వారు అన్నారు. జెనాకు మూర్చ వ్యాధి వచ్చినప్పుడు సర్కస్‌లోని మైకులను బంద్ చేయాల్సిందిగా తాను కేక వేసినట్టు రింగ్ మాస్టర్ తెలిపాడు. ఏది ఏమైనప్పటికీ పులులు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. వాటిని అటవీప్రాంతంలో వదిలేయాలి కానీ, సర్కస్‌లలో ఫీట్లు చేయించకూడదని జంతుప్రేమికులు చెబుతున్నారు.

English summary
A shocking footage that's going viral shows a tigress collapsing while convulsing in a circus ring seconds after jumping through rings of fire.According to reports, the six-year-old big cat, called Zena, was part of a show being led by brother-sister duo Artur and Karina Bagdasarov at the circus in Magnitogorsk, Russia.In the video, the Handler, fearing other tigers would instinctively attack it, is seen trying to drag the struggling Siberian tigress away by the tail and others throw buckets of water
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X