వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్... ఆస్పత్రిలో చేరిక...

|
Google Oneindia TeluguNews

దిగ్గజ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియాలో మంగళవారం(ఫిబ్రవరి 23) ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాలిఫోర్నియాలోని బ్లాక్ హార్స్ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా.. టైగర్ వుడ్స్ కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు ఒక పక్క భాగం నుజ్జునుజ్జయింది. టైగర్ వుడ్స్ అందులోనే ఇరుక్కుపోగా... హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

 tiger woods hospitalised after major car crash in california

అనంతరం ఆస్పత్రికి తరలించారు. అతని కాలికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. ప్రమాద సమయంలో కారులో టైగర్ వుడ్స్ ఒక్కరే ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 7.15గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

గత వీకెండ్‌లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన గోల్ఫ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతకు ట్రోఫీని బహుకరించారు. డిస్కవరీ గ్రూపుకు చెందిన గోల్ఫ్ టీవీలో ఓ కార్యక్రమానికి సంబంధించి సోమ,మంగళవారాల్లో ఆయన షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే కారు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు.

టైగర్ వుడ్స్ రోడ్డు ప్రమాదానికి గురవడం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండుసార్లు 2009,2017లలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మొదటి రోడ్డు ప్రమాదం తర్వాత దాదాపు ఐదు నెలలు మిసిసిపీలోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో గడిపారు. రెండో ప్రమాదంలోనూ కొద్ది నెలలకు కోలుకుని గోల్ఫ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

English summary
Golfer Tiger Woods has been injured in a major car accident in California on Tuesday, the Los Angeles County Sheriffs Department said. Mark Steinberg, Tiger's agent, said the golfer sustained multiple leg injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X