వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TIKTOK:ట్రాన్స్‌పెరెన్సీ రిపోర్టు విడుదల చేసిన టిక్‌టాక్..అందులో భారత్‌దే తొలి స్థానం

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ భారత్‌లో దుమ్మురేపుతోంది. చైనా సంస్థ రూపొందించిన ఈ యాప్‌కు అక్కడ కూడా అంత ప్రాధాన్యత లేదు. కానీ భారత్‌లో మాత్రం ఈ వీడియో యాప్‌కు యమ క్రేజ్ లభిస్తోంది. టిక్‌టాక్‌లో వీడియోలు చేయడంతో పాటు పలు అభ్యంతకర పోస్టులు కూడా చాలామంది పెడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. 2019లో జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఇలాంటి అభ్యంతకర పోస్టులు పెట్టిన వారి అకౌంట్ వివరాలు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం టిక్ ‌టాక్ సంస్థను కోరింది. మొత్తం 118 విజ్ఞప్తులు ఆ సంస్థకు వెళ్లాయని టిక్ టాక్ విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడించింది. ఇక చైనా నుంచి పోస్టులపై ఒక్క రిక్వెస్టు కూడా రాలేదని ఆ సంస్థ పేర్కొంది.

పెళ్లిలో టిక్‌టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్‌లో కాల్పులుపెళ్లిలో టిక్‌టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్‌లో కాల్పులు

 కొన్ని అకౌంట్లకు సంబంధించిన సమాచారం కోరిన భారత్

కొన్ని అకౌంట్లకు సంబంధించిన సమాచారం కోరిన భారత్

11 అకౌంట్లకు సంబంధించి భారత ప్రభుత్వం సమాచారం ఇవ్వాల్సిందిగా కోరిందని ఇందులో 107 చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని టిక్‌టాక్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎవరైనా స్థానిక చట్టాలను ఉల్లంఘించి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలోనే టిక్‌టాక్ యాజమాన్యంను కేంద్రం ఆశ్రయించింది. టిక్‌టాక్‌కు భారత్‌లో 200 మిలియన్ యూజర్లు ఉన్నారు. భారత ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 47శాతం కేసుల్లో టిక్‌టాక్ చర్యలు తీసుకుందని వివరించింది. మరో 8 ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది.

భారత్ తర్వాత అమెరికా జపాన్ దేశాలు

భారత్ తర్వాత అమెరికా జపాన్ దేశాలు

ఇక భారత్ తర్వాత ఫిర్యాదులు అందిన దేశాల్లో అమెరికా 79 విజ్ఞప్తులతో రెండో స్థానంలో నిలిచిందని టిక్‌టాక్ సంస్థ పేర్కొంది. 255 అకౌంట్లకు సంబంధించి అమెరికా విజ్ఞప్తులు పెట్టిందని ఇందులో 86శాతం విజ్ఞప్తులకు సమాచారం అందించామని వెల్లడించింది.ఇక 39 ఖాతాలకు సంబంధించి 35 విజ్ఞప్తులు పెట్టి జపాన్ మూడో స్థానంలో నిలించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ డౌన్‌లోడ్లు టిక్‌టాక్ ద్వారా జరిగాయని వివరించిన సంస్థ... అమెరికా మార్కెట్‌లో37.6 మిలియన్ డౌన్‌లోడ్లు జరిగినట్లు పేర్కొంది. దీంతో భారత్, చైనా దేశాల తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది.

అవసరం మేరకే యూజర్ల సమాచారం: యాజమాన్యం

అవసరం మేరకే యూజర్ల సమాచారం: యాజమాన్యం

చట్టాలకు లోబడుతూనే యూజర్ల ప్రైవసీని పరిరక్షిస్తామని చెప్పారు టిక్ టాక్ పబ్లిక్ పాలసీ చీఫ్ ఎరిక్ ఎబెన్‌స్టీన్. ఆయా దేశ ప్రభుత్వాలు అడిగిన సమాచారం మేరకే వివరాలను అందజేస్తామని యాజమాన్యం చెప్పుకొచ్చింది. అయితే టిక్‌టాక్ యాప్‌ను అమెరికా ఆర్మీ, మరియు నేవీలు నిషేధం విధించాయని పేర్కొంది. ఇదిలా ఉంటే చైనాకు చెందిన సంస్థ కావడంతో ఈ యాప్‌పై గట్టి నిఘా ఉంచింది అమెరికా ప్రభుత్వం. అమెరికా పౌరులకు సంబంధించిన వ్యక్తిగత డేటా ఏమైనా చోరీకి గురవుతుందా అనే అనుమానం వచ్చిన నేపథ్యంలో యాప్‌పై గట్టి నిఘాను ఉంచింది అగ్రరాజ్యం.

English summary
India sent a total of 118 requests to the Chinese short-video making platform TikTok in the in the first half of 2019 (January 1-June 30, 2019) to take certain actions against those accounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X