వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్ యాప్‌తో పిల్లలు జాగ్రత్త... భారీ జరిమానా విధించిన అమెరికా

|
Google Oneindia TeluguNews

చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ నెట్‌వర్క్ టిక్‌టాక్ పై అమెరికా యంత్రాంగం భారీగా జరిమానా విధించింది. అమెరికా చిన్నారుల నుంచి అక్రమంగా సమాచారం సేకరించినందుకు గాను ఆదేశం 5.7 మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది. టిక్‌టాక్‌కు అనుబంధంగా ఉన్న మ్యూజికల్ లీ‌లో చిన్నారుల నుంచి అక్రమంగా సేకరించిన సమాచారంను పొందుపర్చినట్లు ది ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గుర్తించి పెనాల్టీ విధించింది.

ఇక టిక్‌టాక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంపై దుమ్మురేపుతోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి యువత ఈ యాప్‌ను అదేపనిగా డౌన్‌లోడ్ చేసుకుని వీడియోలను వీక్షిస్తూ వాటిని డబ్ స్మాష్ చేస్తూ స్నేహితులకు షేర్ చేస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ అయిన ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్, స్నాప్ చాట్‌లు పిల్లల ఆన్‌లైన్ వ్యక్తిగత పరిరక్షణ చట్టంకు అనుగుణంగా ఉన్నాయి. కానీ టిక్ టాక్ మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా చిన్నారుల వ్యక్తిగత సమాచారంను సేకరిస్తోందని అధికారులు చెప్పారు.

TikTok app fined in the US for illegally gathering childrens data

ఒకప్పుడు మూజికల్ డాట్ లీ పేరుతో ఉన్న టిక్ టాక్... ఆ సమయంలో ఈ యాప్‌ను చాలామంది పిల్లలు వినియోగిస్తున్నారన్న విషయం గ్రహించి పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు అంటే... వారి పేర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారంను తల్లిదండ్రుల అనుమతులు లేకుండా పొందుపరుస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్ టాక్ పై భారీ జరిమానా విధించడంతో ఇతర ఆన్‌లైన్ సర్వీసులు కూడా అలర్ట్ అవుతాయని ఇది ఒక హెచ్చరికలా ఉండాలని అధికారులు వెల్లడించారు.

ఇక గతేడాది టిక్‌టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ యూజర్లు ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. చైనాకు చెందిన బైట్ డాన్స్ కంపెనీ ఈ యాప్‌ను కొనుగోలు చేసింది. అమెరికాలో మ్యూజికల్ డాట్ లీ యాప్‌తో ఇది విలీనం అయ్యింది. ఇక ఈ యాప్‌లో ఈమెయిల్, ఫోన్ నెంబర్, యూజర్ నేమ్ లాంటి కనీస సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది. ఇలా 65 మిలియన్ అకౌంట్లు అధికారికంగా రిజిస్టర్ అయ్యాయి. అయితే ఇందులో చాలా మంది 13 ఏళ్ల లోపు ఉన్నవారే అని అధికారులు ధృవీకరించారు. దీంతో ఆ సంస్థ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.

English summary
The fast-growing, Chinese-owned video sharing network TikTok agreed to pay a $5.7 million fine to US authorities to settle charges that it illegally collected personal information from children, officials said Wednesday.The Federal Trade Commission said the penalty by the social network which had been known as Musical.ly was the largest in a children’s privacy investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X