వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్‌లో బిగ్ వికెట్: సీఈఓ కెవిన్ గుడ్‌బై: జూన్‌లో జాయిన్: డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: చైనాకు చెందిన టాప్ వీడియో ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో బిగ్ వికెట్ పడింది. టిక్‌టాక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కెవిన్ మాయెర్ తన పదవికి గుడ్‌బై చెప్పారు. కంపెనీ నుంచి తప్పుకొన్నారు. ఇదివరకు డిస్నీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన కెవిన్ తన పదవికి రాజీనామా చేయడం కార్పొరేట్ సెక్టార్‌లో కలకలం రేపింది. మూడు నెలల వ్యవధిలోనే కెవిన్ తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించకుంది. అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో చోటు చేసుకుంటోన్న పరిణామాలే కెవిన్ రాజీనామాకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఆన్‌లైన్ మూవీ స్ట్రీమింగ్ కంపెనీ డిస్నీ ప్లస్‌కు కెవిన్ రూపకర్త. ఆయన హయాంలోనే డిస్నీ ప్లస్ ఆవిర్భవించింది.

Recommended Video

TikTok CEO Kevin Mayer Resigns ప్రపంచవ్యాప్తంగా ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొంటోన్న టిక్‌టాక్ !
వెనెస్సా పప్పాస్‌తో భర్తీ

వెనెస్సా పప్పాస్‌తో భర్తీ

కెవిన్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన సీఈఓ స్థానాన్ని వెనెస్సా పప్పాస్‌తో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన టిక్‌టాక్ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పప్పాస్.. టిక్‌టాక్ సీఈఓగా బాధ్యతలను స్వీకరిస్తారని తెలుస్తోంది. మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ, శాన్‌డియాగో స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టాలను అందుకున్న కెవిన్.. ఈ ఏడాది జూన్‌లో టిక్‌టాక్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. అంతలోనే ఆయన తప్పుకున్నారు.

అమెరికాలో బ్యాన్ బెదిరింపులే కారణమా?

అమెరికాలో బ్యాన్ బెదిరింపులే కారణమా?

ప్రస్తుతం టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధపు కత్తి వేలాడుతోంది. ఏ క్షణమైనా టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశాలు ప్రస్తుతం అమెరికాలో నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితులే ఆయన రాజీనామాకు కారణమయ్యాయనే అభిప్రాయాలు కార్పొరేట్ సెక్టార్‌లో వినిపిస్తున్నాయి. జాతీయ భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని టిక్‌టాక్‌ వినియోగాన్ని నిషేధించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామంటూ తరచూ అమెరికా ప్రభుత్వం చెబుతూ వస్తోంది. నిషేధం విధించాలంటూ ఇదివరకే 25 మంది సెనెటర్లు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ సైతం రాశారు. అమెరికాకు చెందిన కీలక సమాచారాన్ని టిక్‌టాక్ ద్వారా చైనా తస్కరిస్తోందనే కారణాన్ని వారు చూపారు.

భారత్‌లో బ్యాన్ తరువాత..

భారత్‌లో బ్యాన్ తరువాత..

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ యాప్‌కు ఉన్న క్రేజ్ ఏ పాటిదో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని విషయం. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మేర స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అయినట్లుగా భావిస్తున్నారు. భారత్ సహా అన్ని దేశాల్లోనూ ఈ వీడియో ప్లాట్‌ఫామింగ్ యాప్‌కు మంచి డిమాండ్ ఉంది. చైనాతో సరిహద్దు గొడవలు చెలరేగడం, ఆ దేశానికి చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు, భారత సైనికులపై ప్రాణాంతక దాడులకు పాల్పడటం వంటి పరిణామాల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ వినియోగాన్ని నిషేధించింది.

అమెరికాలోనూ నిషేధం దిశగా..

అమెరికాలోనూ నిషేధం దిశగా..

అమెరికాలో కూడా ఇదే తరహా వాతావరణం నెలకొంది. టిక్‌టాక్ చైనాకు చెందిన సంస్థ కావడం వల్ల ఈ యాప్ ద్వారా కీలక సమాచారం చోరీకి గురవుతోందంటూ అమెరికా పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యాప్ వినియోగాన్ని నిషేధించే దిశగా చర్యలను తీసుకుంటామంటూ హెచ్చరిస్తూ వస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్యే కెవిన్ ఆ సంస్థ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. దాన్ని నిలబెట్టడానికి తనవంతు ప్రయత్నాలు సాగించారు. అవేవీ ఫలించకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారని అంటున్నారు.

కెవిన్ రాజీనామాపై

కెవిన్ రాజీనామాపై

కెవిన్ మాయెర్ రాజీనామా పట్ల టిక్‌టాక్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యీమింగ్ స్పందించారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకోగలమని చెప్పారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఆయన ఓ లేఖ రాశారు. రాజీనామా చేయాలనే తన నిర్ణయాన్ని ఇదివరకే కెవిన్ తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ రాజకీయపరమైన ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో తాను కొనసాగలేనని కెవిన్ తనకు వివరించినట్లు చెప్పారు. త్వరలోనే ఆయన స్థానాన్ని భర్తీ చేస్తామని ఝాంగ్ యీమింగ్ తన లేఖలో స్పష్టం చేశారు.

English summary
Kevin Mayer has quit TikTok just months after becoming chief executive of the Chinese video app accused by the Trump administration of threatening national security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X