• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిక్ టాక్‌ మధ్యేమార్గం - మైక్రోసాఫ్ట్‌ బదులు ఒరాకిల్‌కు మొగ్గు- ట్రంప్‌ పంతం నెగ్గిందిలా..

|

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలో భాగంగా తమ దేశంలోని టిక్‌టాక్‌ సంస్ధను దేశీయ సంస్ధలకు అమ్మేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డెడ్‌లైన్‌ పెట్టిన నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ కోరుకున్న విధంగా మైక్రోసాఫ్ట్‌కు కాకపోయినా అమెరికాకే చెందిన ఒరాకిల్‌కు విక్రయించాలని టిక్‌టాక్‌ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలన్న తమ ప్రయత్నాలు ఫలించలేదని మైక్రోసాఫ్ట్‌ తాజాగా ప్రకటించింది. అయితే టిక్‌టాక్‌ కొనుగోలుపై ఒరాకిల్‌ ఓ ప్రకటన చేయాల్సి ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ భారీ డీల్‌ ట్రంప్‌ కు చాలా కీలకంగా మారింది.

 ఒరాకిల్‌ చేతికి టిక్‌టాక్‌..

ఒరాకిల్‌ చేతికి టిక్‌టాక్‌..

చైనా సంస్ధ బైట్‌డ్యాన్స్‌ మానసపుత్రిక, ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ దేశాల మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధాల్లో నలిగిపోతోంది. ముఖ్యంగా అమెరికా-చైనా మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా చైనాకు చెందిన టిక్‌టాక్‌ను ఎలాగైనా తమ దేశీయ సంస్ధలకు కట్టబెట్టేలా అధ్యక్షుడు ట్రంప్‌ కొంతకాలంగా పావులు కదుపుతున్నారు. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు టిక్‌టాక్‌ను కట్టబెట్టేందుకు ట్రంప్‌ తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే మైక్రోసాఫ్ట్‌ను కాదని టిక్‌టాక్‌ను ఒరాకిల్‌కు విక్రయించేందుకు బైట్‌డ్యాన్స్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ట్రంప్‌ కోరికను పరోక్షంగా మన్నించేందుకు చైనా సంస్ధ సిద్ధమవుతోంది.

 మైక్రోసాఫ్ట్‌ కీలక ప్రకటన..

మైక్రోసాఫ్ట్‌ కీలక ప్రకటన..

ఇన్నాళ్లు ట్రంప్ సాయంతో ఎలాగైనా టిక్‌టాక్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసిన మైక్రోసాఫ్ట్‌ ఇప్పుడు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలన్నతమ ప్రయత్నాలు విఫలమైనట్లు మైక్రోసాఫ్ట్‌ ఆదివారం ప్రకటించింది. అమెరికాలో గూఢచర్యానికి పాల్పడుతుందన్న సాకుతో టిక్‌టాక్‌పై నిషేధం విధించిన ట్రంప్‌.. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌కు కట్టబెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అయితే ట్రంప్‌ ఎంత ప్రయత్నించినా, మైక్రోసాఫ్ట్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా టిక్‌టాక్ మాత్రం వీరికి లొంగలేదు. చివరికి మరో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఒరాకిల్‌ చెంతన చేరేందుకు టిక్‌టాక్‌ రెడీ అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 గుట్టుచప్పుడు లేకుండా డీల్‌...

గుట్టుచప్పుడు లేకుండా డీల్‌...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌ నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న నేపథ్యంలో టిక్‌టాక్‌ వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండానే ఒరాకిల్‌తో తెరవెనుక చర్చలు జరిపి డీల్‌ ఒకే చేసుకుంది. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పటికీ వైట్‌హౌస్‌కు కానీ, ఇతరులకు కానీ ఎలాంటి సమాచారం లేదు. మైక్రోసాఫ్ట్‌ చేసిన ప్రకటన ఆధారంగానే ఈ డీల్‌ తమ చేజారిందని ఒప్పుకున్నట్లయింది. దీనిపై వైట్‌ హౌస్‌ కానీ, ఒరాకిల్‌ కానీ, అటు టిక్‌టాక్‌ కానీ ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

 అమెరికాకే పరిమితమా లేక...?

అమెరికాకే పరిమితమా లేక...?

అయితే ఒరాకిల్‌ టిక్‌టాక్‌ను అమెరికా వరకే తీసుకుంటుందా లేక భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ టేకోవర్‌ చేస్తుందా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ అమెరికాను దాటి ఒరాకిల్‌ టిక్‌టాక్‌ను టేకోవర్‌ చేయగలిగితే అది మరో సంచలనమే అవుతుందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ సత్తా ఒరాకిల్‌కు ఎలాగో ఉండటంతో ఇప్పుడు ఈ డీల్‌పై అంతర్జాతీయ సంస్ధలు సైతం ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే ఏ డీల్‌ అయినా ట్రంప్‌ సర్కారులోని విదేశీ పెట్టుబడుల విభాగం సమీక్షించాల్సి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అమెరికా సంస్ధకే కట్టబెడుతున్నందున ట్రంప్‌ కూడా దీనికి అంగీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

  Donald Trump : US President Trump Nominated For 2021 Nobel Peace Prize || Oneindia Telugu
   ట్రంప్‌ పంతం నెగ్గిందిలా...

  ట్రంప్‌ పంతం నెగ్గిందిలా...

  టిక్‌టాక్‌కు ప్రస్తుతం అమెరికాలో 100 మిలియన్‌ యూజర్లు, మొత్తం మీద 700 మిలియన్‌ యూజర్లు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపై ఒత్తిడి పెంచే క్రమంలో టిక్‌టాక్‌ను టార్గెట్‌ చేశారు. అమెరికా సంస్ధలకు దాన్ని విక్రయించాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మైక్రోసాఫ్ట్‌కు కాకపోయినా అమెరికాకే చెందిన ఒరాకిల్‌కు టిక్‌టాక్‌ను విక్రయించగలిగితే అది కూడా ట్రంప్‌ విజయంగానే చెప్పవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్న ట్రంప్‌కు ఇదో విజయంగా మారబోతోంది. ముఖ్యంగా వాణిజ్య యుద్ధంలో అమెరికాతో సై అంటే సై అంటున్న చైనా మెడలు వంచి ఆ దేశానికి చెందిన ప్రముఖ వీడియో యాప్‌ను తమ దేశీయ సంస్ధతో కొనుగోలు చేయించడం ట్రంప్‌ ఇమేజ్‌ పెంచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చైనాను వ్యతిరేకిస్తున్న అమెరికన్ భారతీయుల్లోనూ ఇది సానుకూలంగా మారనుంది.

  English summary
  The owner of TikTok has chosen Oracle over Microsoft as its preferred suitor to buy the popular video-sharing app, according to sources.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X