వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృషణాలకు రుచి చూసే గుణం ఉంటుందా.. టిక్‌టాక్‌ను ఊపేస్తోన్న ఛాలెంజ్..

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండు అంశాలు ప్రధానంగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఒకటి చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ కాగా.. మరొకటి టిక్‌టాక్‌ను ఊపేస్తోన్న వృషణాలతో రుచి చూసే ఛాలెంజ్. వృషణాలతో రుచి చూడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును టిక్‌టాక్‌లో ఇప్పుడిదో ట్రెండీ ఛాలెంజ్. పురుషులు తమ వృషణాలను సోయా సాస్‌లో ముంచి.. వాటికి రుచి చూసే గుణం ఉందో లేదో తెలుసుకుంటున్నారు. ఆ వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తున్నారు.

గతవారం టిక్‌టాక్‌లో 'crynginginthecar'అనే యూజర్ ఐడీతో రేగన్ అనే యువతి పోస్ట్ చేసిన వీడియో ఈ కొత్త ఛాలెంజ్‌కు కారణమైంది. 2013లో ఓ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌ గురించి ప్రస్తావిస్తూ.. అందులో వృషణాలకు రుచిని గ్రహించే గుణం ఉందని చదివానని, ఇది నిజమో కాదమో తాను తెలుసుకోవాలనుకుంటున్నానని వీడియోలో పేర్కొంది. సైన్స్‌కు సంబంధించిన ఈ విషయాన్ని తాను తప్పక తెలుసుకోవాలనుకుంటున్నానని, వృషణాలు ఉన్నవారు ఈ ప్రయోగం చేసి చూడాలని చెప్పింది.

TikTok weird Challenge of Dipping Testcles in Soy Sauce

రేగన్ ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి చాలామంది ఈ ప్రయోగానికి తెరలేపారు. అలెక్స్ జేమ్స్ అనే వ్యక్తి తన వృషణాలపై సోయా సాస్ చుక్కలను వేసి పరీక్షించాడు. ఆ వెంటనే ఓ మై గాడ్.. రిడుక్యులస్ అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు.అయితే ఈ ప్రయోగంపై పరిశోధకులు ఏమంటున్నారంటే.. సాధారణంగా మనిషి శరీరం నిండా రుచి గ్రాహకాలు ఉంటాయని.. అలాగే వృషణాలపై కూడా ఉంటాయని అంటున్నారు. నాలుకపై ఉండేవి రుచి మొగ్గలు అని, ఇవి రుచి గ్రాహకాలు అని చెబుతున్నారు. అయితే రుచి గ్రాహకాల పనితీరు గురించి తెలియదని, వాటికి రుచి చూసే గుణం ఉండదని అంటున్నారు. అయితే రసాయనికంగా ఉప్పు,తీపి వంటి వాటిని ఇవి గుర్తించగలుగుతాయని కానీ రుచి మొగ్గల లాగా రుచిని ఆస్వాదించలేవని చెబుతున్నారు.

English summary
TikTok Challenge of Dipping Testes in Soy Sauce gone viral.First a lady Regan has started all this by appealing that she wants to know If you have testicles please dip your balls in something, it’s for science and I must know,” in no time TikTok users thronged to the platform to take up the challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X