వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నంతపని చేసిన డొనాల్డ్ ట్రంప్: ఆదివారం నుంచే అమెరికాలో టిక్‍‌టాక్, వీచాట్‌పై నిషేధం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ తర్వాత చైనాకు గట్టి షాకిచ్చింది అమెరికా. చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను నిషేధిస్తున్నట్లు యూఎస్ ప్రకటించింది. వచ్చే ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేస్తున్నట్లు అమెరికా వాణిజ్య విభాగం తన ప్రకటనలో స్పష్టం చేసింది.

100 మిలియన్ల పౌరుల సమాచారంపై టిక్‌టాక్ కన్ను..

100 మిలియన్ల పౌరుల సమాచారంపై టిక్‌టాక్ కన్ను..

అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ విల్‌బర్ రోస్ ఆరోపించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బైట్‌డ్యాన్స్ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో భద్రతారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.

ట్రంప్ ఎఫెక్ట్.. మిగితా ఆంక్షలు త్వరలో..

ట్రంప్ ఎఫెక్ట్.. మిగితా ఆంక్షలు త్వరలో..


తాజా నిర్ణయానికి సంబంధించిన మిగితా ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని యూఎప్ డిపార్ట్ మెంట్ ఆఫ్ కామన్స్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి అమెరికాపై తీవ్ర ప్రభావం చూపిన నాటి నుంచీ.. చైనాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. డ్రాగన్ దేశం చేసిన తప్పునకు ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు.

చైనాపై ట్రంప్ గుస్సా..

చైనాపై ట్రంప్ గుస్సా..

ఈ నేపథ్యంలోనే ట్రంప్.. చైనాపై వాణిజ్య పరమైన ఆంక్షలను విధిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. చైనాకు సంబంధించిన యాప్‌లపై నిషేధం విధిస్తామంటూ గతంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య శాఖ టిక్‌టాక్ తోపాటు వీచాట్ యాప్‌లపై నిషేధం విధించడం గమనార్హం.

Recommended Video

TikTok, Wechat పై నిషేధం విధించిన US.. వచ్చే ఆదివారం నుంచి డౌన్‌లోడ్‌లు నిలిపివేత!!
భారత్‌లో వందకుపైగా చైనా యాప్‌లపై నిషేధం..

భారత్‌లో వందకుపైగా చైనా యాప్‌లపై నిషేధం..

కాగా, నరేంద్ర మోడీ నేతృత్వంలోనే భారత ప్రభుత్వం ఇప్పటికే చైనాకు సంబంధించిన హలో, టిక్‌టాక్, వీచాట్ లాంటి వందకుపైగా యాప్‌లను దేశంలో నిషేధించిన విషయం తెలిసిందే. సరిహద్దులోని గల్వాన్ వద్ద ఘర్షణలకు తెగబడి 20 మంది భారత జవాన్ల మరణానికి కారణమైన నేపథ్యంలో చైనాపై మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. భద్రతాపరమైన కారణాలతోనే ఈ యాప్‌లపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

English summary
TikTok will be banned in the US from Sunday. Users in the country will be stopped from downloading the video app as well as WeChat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X