వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, టిమ్‌కుక్ సంచలనం: మూకుమ్మడిగా: నల్లజాతీయులకు అండగా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆఫ్రికన్ అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసను ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆందోళలను కొనసాగిస్తున్నారు. విధ్వంసానికి దిగుతున్నారు. అమెరికన్లు జాత్యహంకారానికి పాల్పడుతున్నారని, తమ సామాజిక వర్గంపై అకారణంగా దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి ఆందోళనలు, నిరసన ప్రదర్శలు రాజధాని వాషింగ్టన్‌ వరకూ పాాకాయి. ఇది కాస్తా సైన్యాన్ని సైతం రంగంలోకి దిగడానికి కారణమైంది.

అమెరికాను అగ్నిగోళంలా మార్చేసిన జార్జ్ ఫ్లాయిడ్ పోస్ట్‌మార్టమ్ నివేదిక: షాకింగ్అమెరికాను అగ్నిగోళంలా మార్చేసిన జార్జ్ ఫ్లాయిడ్ పోస్ట్‌మార్టమ్ నివేదిక: షాకింగ్

 దిగ్గజ కంపెనీలు ఏకతాటిపైకి..

దిగ్గజ కంపెనీలు ఏకతాటిపైకి..

ఆఫ్రికన్ అమెరికన్ల ఆందోళనలకు దిగ్గజ సంస్థలు మద్దతు పలికాయి. వారికి అండగా నిల్చున్నాయి. జాతి సమైక్యత కోసం ప్రదర్శనకారులకు సంఘీభావాన్ని తెలిపాయి. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమౌతున్నాయని, జాత్యహంకారానికి అద్దం పడుతుననాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వివక్షను ఎదుర్కొంటోన్న నల్ల జాతీయులకు ప్రతి ఒక్కరూ అండగా నిల్చోవాల్సిన పరిస్థితుల తలెత్తాయని పేర్కొన్నాయి.

నల్ల జాతీయులకు అండగా సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, టిమ్‌కుక్..

నల్ల జాతీయులకు అండగా సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, టిమ్‌కుక్..

మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏకం అయ్యారు. జాతి వివక్షతను ఎదుర్కొంటోన్న నల్ల జాతీయులకు అండగా తాము ఉన్నామని ప్రకటించారు. వేర్వేరు ప్రకటనలను జారీ చేశారు. అమెరికన్ సమాజంలో కీలక భాగస్వామ్యులైన నల్ల జాతీయుల పట్ల వివక్షను ప్రదర్శించడం సరికాదని టిమ్‌కుక్ పేర్కొన్నారు. ఆఫ్రికన్ అమెరికన్ కావడం వల్లే జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు హత్య చేశారని, ఆ ఘటన తనను కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతి సమానత్వం కోసం ఒకరికొకరు అండగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయని అన్నారు.

 వర్ణ వివక్ష కొత్తేమీ కాదు.. సత్య నాదెళ్ల

వర్ణ వివక్ష కొత్తేమీ కాదు.. సత్య నాదెళ్ల

అమెరికాలో వర్ణ వివక్ష కొత్తేమీ కాదని మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల అన్నారు. ప్రతి రోజూ నల్ల జాతీయులు జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వర్ణ వివక్షనకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను పంచుకోవాలని, తామందరూ జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఉన్నామనే విషయాన్ని చాటి చెప్పాలని సూచించారు.

 ఆందోళనకారులకు సంఘీభావం: సుందర్ పిచాయ్

ఆందోళనకారులకు సంఘీభావం: సుందర్ పిచాయ్

వర్ణ వివక్షను ఎదుర్కొంటోన్న ఆఫ్రికన్ అమెరికన్లు చేపట్టిన ఆందోళనకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఇందులో భాగంగా అమెరికాలో గూగుల్, యుట్యూబ్ హోమ్‌పేజీలపై ఈ విషయాన్ని ప్రదర్శించడానికి అనువుగా చర్యలను చేపట్టామని చెప్పారు. అమెరికాలో జాత్యహంకారాన్ని ఎదుర్కొంటూ భయాన్ని, బాధలను అనుభవిస్తోన్న వారు ఒంటరి కాదని, తాము వారికి తోడుగా ఉన్నామని సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.

English summary
Apple, which had to shut a majority of retail stores in the US after the protests against the killing of African-American George Floyd in police custody turned violent, has come out in support of racial equality. Leaders of other prominent technology firms such as Microsoft and Google also spoke out. Google CEO Sundar Pichai, Microsoft CEO Satya Nadella said the company has decided to share its support for racial equality in solidarity with the black community on Google and YouTube homepages in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X