వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు .. ఎవరెవరంటే

|
Google Oneindia TeluguNews

టైమ్స్ మేగజైన్ ప్రతిష్టాత్మకంగా వెలువరించే 100మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురికి స్థానం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్స్ జాబితాలో రియలన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది అరుంధతి కట్జూ, ప్రముఖ సీనియర్ న్యాయవాది మేనకా గురు స్వామీ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు.

టైమ్స్ సంస్థ బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, గోల్ఫ్ వీరుడు టైగర్ వుడ్స్,ఇండియన్-అమెరికన్ కమెడియన్, టీవీ హోస్ట్ హసన్ మిన్హాజ్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, ఆస్కార్ విన్నర్ లేడీ గాగా, నటుడు డ్వేన్ జాన్సన్ తదితరులు స్థానం దక్కించుకున్నారు .

TIMEs 100 most-influential people list: three indian pioneers and they are ...

టైమ్స్ 100మంది ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన అంబానీ గురించి మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మేగజైన్‌లో ప్రశంసలు కురిపించారు. ధీరూబాయ్ అంబానీ ఒక మంచి విజన్‌తో వ్యాపారాని చేశారని ఇక తండ్రి విజన్ ను అంబానీ మరింత ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు .ఇక న్యాయవాది అరుంధతి కట్జూ, మేనకా గురు స్వామీ సామాజిక సమస్యలపై వీరిద్దరు చాలాకాలంగా పోరాడుతున్నారు.

అరుంధతీ కట్జూ, మేనకా గురుస్వామి ఇద్దరూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారే కావటం విశేషం .అరుంధతి కట్జూ ప్రొఫైల్‌ను ప్రముఖ నటి ప్రియాంక చోప్రా రాశారు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఆమె చేసిన కృషిని వివరించారు. టైమ్స్ జాబితాలో స్థానం దక్కటం నిజమైన గుర్తింపు అని ఆమె అన్నారు.

English summary
The Time 100 Most Influential People 2019 list was released Wednesday, naming the world's most influential pioneers, leaders, titans, artists and icons of the year.The list includes three Indian pioneers,Reliance Industries Chairman Mukesh Ambani and public-interest litigators Arundhati Katju and Menaka Guruswamy, who led a legal battle for the rights of LGBTQ community in India, have joined the list of Indians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X