వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కివీస్‌లోని ఓ సిటీలో వింత: ఉద్యోగాలు పుల్ అభ్యర్ధులు మాత్రం నిల్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుతుండటంతో ఉపాధి లోపించి నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇదొకటి. అయితే న్యూజిలాండ్‌లోని ఓ చిన్న పట్టణంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

ఆ పట్టణంలో కావాల్సినన్ని ఉద్యోగాలు, ఇల్లులు ఉన్నప్పటికీ వాటిలో నివసించేందుకు జనాభా తగినంత మంది లేకపోవడం విశేషం. దీంతో ఉద్యోగులు కావాలంటూ అక్కడి ప్రభుత్వం పరితపించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వివరాల్లోకి వెళితే న్యూజిలాండ్‌లోని క్లుతా జిల్లాలో కైటంగట అనే చిన్న పట్టణం ఉంది.

place

సుమారు 800 మంది నివాసితులు ఉంటున్న ఈ పట్టణంలో ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఉద్యోగం చేయడానికి అభ్యర్ధులు లేక అక్కడి ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం, వ్యాపారులు ఉద్యోగార్ధుల వేట కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది.

అంతేకాదు ఈ ప్రాంతంలో వ్యాపారం చేయాలనుకునే వారికి అద్భుతమైన ఆఫర్లను కూడా అందిస్తోంది. దీంతో పాటు తక్కువ మొత్తానికి నివాసాలు, ఉద్యోగంలో చేరే వారికి అధిక మొత్తంలో వేతనాలు చెల్లించేందుకు కూడా ముందు కొచ్చింది. దీనిపై క్లుతా జిల్లా మేయర్ బ్రియాన్‌ కేడోజెన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో 1,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

నేను నిరుద్యోగిగా ఉన్నప్పుడు నా కుటుంబం పొట్ట నింపేందుకు ఈ జిల్లా నాకొక అవకాశాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్న ఎందరో కుటుంబాలకు అండగా నిలిచేందుకు క్లుతా జిల్లా సిద్ధంగా ఉందన్నారు. అయితే కైటంగట పట్టణం కాస్త మారుమూల ప్రాంతం కావడంతో ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపండ లేదన్నారు.

map

ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు తన వంతుగా ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కాగా, క్లుతా జిల్లాలో ఉద్యోగాలు ఎక్కువగా డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్ లాంటి పరిశ్రమలకు సంబంధించిన వారు కావడం విశేషం. అయితే ఇక్కడ నివసించే ప్రజలు ఉద్యోగాల డిమాండ్‌కు సరిపోవడం లేదు.

దీంతో సమీపంలోని డునిడెన్ అనే పట్టణంలోని ప్రజలను అవసరాలకు అనుగుణంగా బస్సుల్లో రప్పిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచమంతా నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతుంటే అభ్యర్థుల కోసం ఉద్యోగాలు ఎదురుచూడటం కొంచెం వింతగానే ఉంది. పట్టణీకరణలో భాగంగా గ్రామాల్లోని ప్రజలు చాలా వరకు పట్టణాల్లో నివసిస్తోన్న సంగతి తెలిసిందే.

English summary
A tiny New Zealand town has a unique problem – too many jobs, too many affordable houses and not enough people to fill them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X