వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మోకర్స్ మరణంపై రూ.6 లక్షలను ఆర్జిస్తున్న పొగాకు కంపెనీలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద పొగాకు కంపెనీలు ఒక్కో స్మోకర్‌ మరణంపై రూ.6 లక్షలను పిండేస్తున్నాయని (9730 డాలర్లు) ఓ నివేదిక పేర్కొంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లోని పొగరాయుళ్లను ఈ కంపెనీలు పీల్చిపిప్పిచేస్తున్నాయని వెల్లడించింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న పొగాకు పర్యవసానాలపై అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ, వైటల్‌ స్ట్రేటజీస్‌ సంస్ధలు టొబాకో అట్లాస్‌ నివేదికను రూపొందించాయి.

 Tobacco industry profits USD 9k from every smoker's death: Report

పొగాకు పరిశ్రమ తమ లాభాలు పెంచుకునేందుకు అనుసరిస్తున్న తాజా ఉత్పత్తులు, ఎత్తుగడలతో పాటు పొగాకు నియంత్రణ చర్యలను ఇవి ఎలా నీరుగారుస్తున్నాయో నివేదిక వెల్లడించింది.

కేవలం 2016లోనే ప్రపంచవ్యాప్తంగా పొగాకు తినడంతో 71 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఈ నివేదిక వెల్లడించింది. వీటిలో అత్యధిక మరణాలు సిగరెట్‌ స్మోకింగ్‌ వల్ల కాగా, 8,84,000 మరణాలు సెకండ్‌హ్యాండ్‌ స్మోక్‌ కారణంగా సంభవించాయి.

అదే సమయంలో పొగాకు కంపెనీల లాభాలు 6200 కోట్ల డాలర్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. ఇది పొగతాగడం వల్ల చోటుచేసుకున్న ఒక్కో మరణానికి 9730 డాలర్లతో సమానమని గతంలో ఇది 7000 డాలర్లుగా ఉందని ఈ నివేదిక లెక్కగట్టింది.

English summary
The world's biggest tobacco companies make a profit equivalent to USD 9,730 for the death of each smoker, claims a report which found that the industry is increasingly profiting from vulnerable populations of countries in Africa, Asia, and the Middle East.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X