వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ పాడైపోయిన టాయ్‌లెట్లు.. డయాపర్లతో వ్యోమగాములు

|
Google Oneindia TeluguNews

పలు అంతరిక్ష పరిశోధనల కోసం నింగిలోకి వెళ్లే వ్యోమగాములు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. భూమికి 400 కిలోమీటర్ల పైన ఉన్న స్పేస్‌ స్టేషన్‌లో టాయ్‌లెట్స్ చెడిపోయినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో నింగిలో ఉన్న వ్యోమగాములు టాయ్‌లెట్ కోసం ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చెడిపోయిన టాయ్‌లెట్స్

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చెడిపోయిన టాయ్‌లెట్స్

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో రెండు టాయ్‌లెట్స్ ఉండగా అందులో ఒకటి అమెరికా మాడ్యూల్‌లో మరొకటి రష్యా మాడ్యూల్‌లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. దీనికి అదనంగా మరో రెండు టాయ్‌లెట్లు స్పేస్ క్రాఫ్ట్‌లో ఉంటాయి. అయితే స్పేస్ క్రాఫ్ట్ కదులుతున్న సమయంలోనే వాటిని వినియోగించాల్సి ఉంటుంది తప్పితే అది ఆగి ఉన్న సమయంలో వాటిని వినియోగించరాదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కమాండర్ లూకా పర్మిటానో చెప్పిన ప్రకారం... అమెరికా మాడ్యూల్‌లో ఉన్న టాయ్‌లెట్ చెడిపోయిందనే సంకేతాలు గ్రౌండ్‌ స్టేషన్‌కు అందుతున్నాయని చెప్పారు. రష్యా మాడ్యుల్‌లో ఉన్న టాయ్‌లెట్ కూడా దాదాపుగా నిండిపోయే స్థితికి వచ్చిందని లూకా చెప్పారు.

మరమత్తులు చేస్తున్న వ్యోమగాములు

మరమత్తులు చేస్తున్న వ్యోమగాములు

చెడిపోయిన అమెరికా మాడ్యుల్‌లోని టాయ్‌లెట్‌కు మరమత్తులు చేసే పనిలో వ్యోమగాములు ఉన్నట్లు గ్రౌండ్ స్టేషన్‌కు సమాచారం పంపినట్లు నాసా అధికారులు తెలిపారు. ఈ టాయ్‌లెట్ నవంబర్ 25న చెడిపోయినట్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పేర్కొంది. ప్రస్తుతం అక్కడ 13 మంది వ్యోమగాములు ఉన్నారు. టాయ్‌లెట్లు చెడిపోవడంతో వారంతా డయాపర్లను వినియోగిస్తున్నట్లు నాసా వెల్లడించింది.

పేరుకుపోయిన నీటిని బయటకు పంప్ చేయలేరు

పేరుకుపోయిన నీటిని బయటకు పంప్ చేయలేరు


ఇక స్పేస్ స్టేషన్‌లో వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ సిస్టంకు టాయ్‌లెట్స్ అనుసంధానమై ఉంటాయి. టాయ్‌లెట్స్‌ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని చెబుతూ వాడకాన్ని కూడా నాసా తగ్గించినట్లు సమాచారం. టాయ్‌లెట్‌లో పేరుకుపోయిన నీరును బయటకు పంప్ చేయలేక లేకపోతున్నట్లు సమాచారం. ఇలా బయటకు నీరు పంప్ చేస్తే పరిశోధనల కోసం అని వెళ్లిన వ్యోమగాములకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని నాసా చెబుతోంది.

టాయ్‌లెట్ల కోసం ప్రత్యేక సూట్లు డిజైన్ చేసిన నాసా

టాయ్‌లెట్ల కోసం ప్రత్యేక సూట్లు డిజైన్ చేసిన నాసా

ప్రస్తుతం షటిల్‌‌లో ఉన్న టాయ్‌లెట్లను వాడటం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందని స్టేషన్ ఫ్లయిట్ డైరెక్టర్ బ్రియాన్ స్మిత్ చెప్పారు. మరమత్తుల కోసం ఆరో రోజుల కంటే ఎక్కువగా సమయం తీసుకుంటే ఇది ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే అక్కడ ఎలాంటి సమస్య తలెత్తిందో పూర్తి స్థాయిలో తెలయడం లేదని వెల్లడించారు. ఒక మిషన్‌పై అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల సౌకర్యంకే నాసా అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందులో ముఖ్యంగా బాత్‌రూంలపైనే దృష్టి ఎక్కువగా సారిస్తుంది. ఇందులో భాగంగానే నాసాకు చెందిన ఇంజినీర్లు ప్రత్యేకమైన సూట్‌ను తయారు చేశారు. నింగిలోకి వెళుతున్న వ్యోమగాములు ఆ సూట్‌లోనే మూత్ర మల విసర్జనలు చేసేలా డిజైన్ చేశారు. ఇలా ఆరు రోజుల పాటు బట్టలు కూడా మార్చుకోనవసరం లేకుండా ఈ ప్రత్యేకమైన సూట్‌ను రూపొందించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ సూట్‌ను డిజైన్ చేసినట్లు వెల్లడించారు.

English summary
At the International Space Station, the astronauts are facing an issue with their toilets. As per NASA reports, all toilets at the International Space Station have broken down and the astronauts are having to use diapers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X