వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్ 7 భారత కంపెనీలకు గట్టి షాక్: ట్రంప్ ఒక్కరే కారణం కాదు...

ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటితో అమెరికా వెళ్లాలనుకునే వారి కలలు కల్లలవుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటితో అమెరికా వెళ్లాలనుకునే వారి కలలు కల్లలవుతున్నాయి. అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఏడు దేశీయ ఐటీ దిగ్గజాలకు హెచ్1బి వీసాలు భారీగా తగ్గాయి.

2015తో పోలిస్తే 2016 ఈ కంపెనీలకు హెచ్1బీ వీసాలు 37 శాతం పడిపోయినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే 2016లో ఆమోదం పొందిన పిటిషన్లు 5,436 కోల్పోయినట్టు వాషింగ్టన్ కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ రిపోర్టు చేసింది.

ఐటీ ఎఫెక్ట్, పడిపోతున్నాయి: భారీగా తగ్గిన అజిమ్ ప్రేమ్‌జీ వేతనంఐటీ ఎఫెక్ట్, పడిపోతున్నాయి: భారీగా తగ్గిన అజిమ్ ప్రేమ్‌జీ వేతనం

మొత్తంగా ఏడు టాప్ కంపెనీలకు కనీసం పదివేల వీసాలు కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో ఈ కంపెనీలకు ఇస్తున్న ఉద్యోగ వీసాల సంఖ్య మరింత తగ్గనుందని అంచనా వేస్తున్నారు.

ఐటీ దిగ్గజాలకు షాక్

ఐటీ దిగ్గజాలకు షాక్

ఏడు భారత ఐటీ దిగ్గజాలకు 2016 ఆర్థిక సంవత్సరంలో కేవలం 9,356 కొత్త హెచ్1బీ పిటిషన్లు మాత్రమే ఆమోదం పొందినట్టు పేర్కొంది. అంటే అమెరికా లేబర్ ఫోర్స్‌లో కేవలం 0.006 శాతమేనని తెలుస్తోంది.

సగానికి పైగా తగ్గిన టీసీఎస్

సగానికి పైగా తగ్గిన టీసీఎస్

రిపోర్టు ప్రకారం దేశీయ టాప్ టెక్ దిగ్గజం టీసీఎస్‌కు ఆమోదం పొందిన కొత్త అప్లికేషన్లు 56 శాతం పడిపోయినట్టు తెలుస్తోంది. గతేడాది 4674 ఉంటే 2016లో 2634 పిటిషన్లు కోల్పోయి, 2040మాత్రమే ఆమోదం పొందాయి.

విప్రో, ఇన్ఫోసిస్‌లదీ అదే

విప్రో, ఇన్ఫోసిస్‌లదీ అదే

విప్రో పిటిషన్లు కూడా 52 శాతం తగ్గిపోయినట్టు వెల్లడించింది. అంటే ఈ కంపెనీ కూడా 1605 పిటిషన్లను కోల్పోయింది. ఇన్ఫోసిస్ కు 16 శాతం తగ్గాయి.

ఇదీ కారణం

ఇదీ కారణం

ప్రభుత్వ డేటా ఆధారంగా లాభాపేక్ష లేని ఈ కంపెనీ వీటి రీసెర్చ్ చేపట్టింది. దేశీయ ఐటీ కంపెనీలు పొందుతున్న కొత్త హెచ్1బీ వీసాలు మరింత తగ్గిపోనున్నాయని ఈ నివేదిక తెలిపింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి డిజిటల్ సర్వీసుల్లోకి ఇండస్ట్రీ మరలుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు వెల్లడైంది.

ట్రంప్ ఎన్నికకు ముందు నుంచే..

ట్రంప్ ఎన్నికకు ముందు నుంచే..

కంపెనీలు కూడా వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికాలో స్థానిక వర్క్ ఫోర్స్‌ను పెంచుతున్నాయని నివేదిక నివేదించింది. అయితే ఈ హెచ్1బీ వీసులు పడిపోవడం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన్నప్పటి నుంచి కాదని, ముందు నుంచీ ఉందని చెబుతోంది.

వీసాలు పొందిన టాప్ కంపెనీల్లో..

వీసాలు పొందిన టాప్ కంపెనీల్లో..

కొత్త హెచ్1బీ వీసాలు పొందిన టాప్ కంపెనీల్లో అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అసెంచర్, విప్రో, ఐబీఎం, అమెజాన్, టెక్ మహింద్రా, క్యాప్జిమినీ, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్ అమెరికా, ఇంటెల్, డెలాయిట్, గూగుల్, లార్సెన్ అండ్ టర్బో, ఆపిల్, సింటెల్, ఫేస్ బుక్, ఒరాకిల్, సిస్కో, మైండ్ ట్రి, గోల్డ్ మాన్ సాచ్స్, యూఎస్టీ గ్లోబల్, జేపీ మోర్గాన్ ఛేస్, స్టాన్ ఫోర్డ్, కేపీఎంజీ, యాహులు ఉన్నాయి.

English summary
Top seven India-based outsourcing companies in the US received fewer H-1B visas in 2016 as compared to 2015, and as a group their numbers dropped by 37 per cent, according to a new report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X