వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఎఫెక్ట్ మొదలు: సర్దుకున్న ఐటీ దిగ్గజాలు, తగ్గిన హెచ్1బీ వీసాలు

అమెరికాలోని ఔట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న ఏడు అగ్రశ్రేణి భారత ఐటీ కంపెనీలకు హెచ్ - 1- బీ వీసాల్లో భారీగా కోతపడింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలోని ఔట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న ఏడు అగ్రశ్రేణి భారత ఐటీ కంపెనీలకు హెచ్ - 1- బీ వీసాల్లో భారీగా కోతపడింది. 2015 - 16 సంవత్సరంతో పోలిస్తే, 2016 - 17లో 37 శాతం దరఖాస్తులు తగ్గాయి. ఏడు అగ్రశేణి ఐటీ సంస్థలు దాఖలు చేసిన హెచ్ 1 బీ వీసా దరఖాస్తుల్లో కొత్తగా 9,356 మాత్రమే ఆమోదం పొందాయి.
అమరికా నిరుద్యోగితలో ఇది కేవలం 0.006 శాతం అంటే అంతా తక్కువ అన్నమాట. దీన్ని బట్టి అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారన్న ప్రచారం కేవలం అతిశేయోక్తేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీ విషయమై కఠినతర ఆంక్షలు విధించడంతో క్రితంసారి కన్నా అధికంగా 5436 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) అనే సంస్థ తెలిపింది. గత ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత సేకరించిన అధికారిక గణాంకాలను ఈ సంస్థ ఇటీవల విడుదల చేసింది.

ఇలా హెచ్ - 1 బీ వీసాల తగ్గింపు

ఇలా హెచ్ - 1 బీ వీసాల తగ్గింపు

‘ఫస్ట్ అమెరికన్ హైర్' నినాదంతో స్థానికులకు అదనపు అవకాశాలు కల్పించేందుకు అమెరికా ప్రభుత్వం హెచ్ - 1 - బీ వీసాలను గణనీయంగా తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ప్రారంభమైన హెచ్ - 1 - బీ వీసా ఆంక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా తమ దరఖాస్తులను భారీగా తగ్గించుకుంటున్నాయి. 2015లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4,674 దరఖాస్తులు దాఖలు చేయగా, 2016లో వాటి సంఖ్యను 2,040కు తగ్గించుకున్నది. అంటే 2,634 దరఖాస్తులు (56 శాతం) కోతకు గురయ్యాయి.

2018లోనూ కొనసాగనున్న ఇదే పరిస్థితి

2018లోనూ కొనసాగనున్న ఇదే పరిస్థితి

విప్రో 3,029 నుంచి 1,474 (52శాతం)కు దరఖాస్తుల్ని పరిమితం చేసింది. ఇక 2015లో 2830 దరఖాస్తులు సమర్పించిన ఇన్ఫోసిస్ 2016లో 16శాతం తగ్గించుకుని 2376 దరఖాస్తులు మాత్రమే దాఖలు చేసింది. భారత ఐటీ కంపెనీలకు హెచ్1బీ వీసాల్లో కోత 2017-18లోనూ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు తోడు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి డిజిటల్ సేవలు పెరుగుతుండడం, కృత్రిమ మేధస్సు అందుబాటులోకి రావడం వంటివి కూడా వీసా దరఖాస్తులను తగ్గించుకునేందుకు కారణమవుతున్నాయి. తగ్గుతున్న కార్మికుల అవసరం, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా వీసాల భారాన్ని తగ్గించుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తున్నదని నివేదిక విశ్లేషించింది. తయారీరంగంలోనూ హెచ్1బీ వీసాల కోత కనబడుతున్నది. 2016లో టెస్లా మోటర్స్ 197 దరఖాస్తులకు 108 పొందగలిగింది. ఉబర్ 121, ఈబే 115, మాయోక్లినిక్ 111 వీసాలను సాధించింది.

అర్హతను మించిన అవసరాలిలా

అర్హతను మించిన అవసరాలిలా

ఏప్రిల్ నెలలో అమెరికాలోని మొత్తం నిరుద్యోగం 4.4శాతంగా నమోదవగా, కంప్యూటర్, గణాంకశాస్త్ర రంగంలోనే అది 2.5 శాతంగా ఉంది. నిర్మాణ రంగంలో నిరుద్యోగిత 2.1 శాతం కన్నా తక్కువగా నమోదైంది. అమెరికాలో 2020 నాటికి అర్హులైనవారి సంఖ్య కన్నా అధికంగా 14 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఉండబోతున్నాయని కోడ్.ఆర్గ్ అనే వెబ్ సైట్ అంచనా వేసింది. అర్హులను మించిన ఉద్యోగాలు ఉంటే వాటిని ఎలా నింపుతారన్నదని ప్రశ్నార్థకంగా మారింది.

స్థానిక నియామకాలపై దృష్టి ఇలా

స్థానిక నియామకాలపై దృష్టి ఇలా

వీసా నిబంధనలను కఠినతరం చేయడం ఇటు నిర్వహణ వ్యయాన్ని పెంచడమే కాక, అటు ప్రతిభావంతులైన ఉద్యోగులను అమెరికాకు తరలించడం కూడా కష్టతరమవుతున్నదని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. అమెరికాలో స్థానిక నియామకాలను పెంచే దిశగా అవి చర్యలు ప్రారంభించాయి. ఇన్ఫోసిస్ ఇప్పటికే రానున్న రెండేండ్లలో 10వేలమంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. స్వదేశీ రక్షణ విధానం పెరుగుతున్న సింగపూర్, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలోనూ వారి బిజినెస్ మోడల్స్‌కు తగినట్లుగా సర్దుబాటై, వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

వీసాలు పొందిన ఐటీ సంస్థలివి

వీసాలు పొందిన ఐటీ సంస్థలివి

2016-17లో హెచ్1బీ వీసాలు పొందిన ఐటీ సంస్థల్లో కాగ్నిజెంట్ (3,949), ఇన్ఫోసిస్ (2,376), టీసీఎస్ (2,040), అసెంచర్ (1,889), ఐబీఎం (1,608), విప్రో (1,474), అమెజాన్ (1,416), టెక్ మహీంద్రా (1,228), క్యాప్‌జెమిని (1,164), మైక్రోసాఫ్ట్ (1,145), హెచ్‌సీఎల్ అమెరికా (1,041), ఇంటెల్ (1,030), డెలాయిట్ (985), గూగుల్ (924), ఎల్ అండ్ టీ (870), ప్రైస్‌వాటర్‌హౌజ్ కూపర్స్ (713), ఎర్నెస్ట్ అండ్ యంగ్ (649), ఆపిల్ (631), సింటెల్ (583), ఫేస్‌బుక్ (472), ఒరాకిల్ (427), సిస్కో (380), మైండ్‌ట్రీ (327), గోల్డ్‌మాన్ సాక్స్ (287), యుఎస్‌టీ గ్లోబల్ (283), జేపీ మోర్గాన్‌చేజ్ (271), ఐ-గేట్ (255), స్టాఫోర్డ్ (221), యాహూ (206), కేపీఎంజీ (198) ప్రధానంగా హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు పొందాయి.

v

v

‘గతంలో అమెరికా విధాన నిర్ణేతలు భారత్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు వీసాలు పొందుతున్నాయని రాజకీయ అవసరాలకో, విధాన కారణంగానో చెప్తుండే వారు. తద్వారా నూతన ఇమ్మిగ్రేషన్ విధానం పేరిట ఆంక్షలు విధించే వారు. గత 15 ఏళ్లుగా ఇది ప్రతియేటా క్షీణించిపోతూనే ఉన్నదన' అని ఎన్ఎఫ్ఎపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ హయాంలో ఇమ్మిగ్రేషన్ అండ్ నాచురలైజేషన్ సర్వీస్ విధాన నిర్ణయాధిపతి స్టువార్ట్ అండర్సన్ వ్యాఖ్యానించారు. హెచ్ 1 బీ వీసా తాత్కాలికమైందని, దీనికంటే ముఖ్యమైనదేమిటంటే అమెరికాలో సుదీర్ఘ కాలం పని చేయాలంటే ఒక విదేశీ విద్యార్థి అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత స్థాయి కోర్సులను అభ్యసించాల్సి ఉంటుందని అప్పుడే ఎక్కువ కాలం అమెరికాలో పని చేయడం ఆచరణాత్మకంగా సాధ్యమవుతుందని ఈ ఫౌండేషన్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీల్లో 77 శాతం మంది ఎలక్ట్రికల్, 71 శాతం మంది కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో విదేశీ విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. హెచ్ 1 బీ వీసాల జారీపై సంస్కరణలు పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశాల వారీగా ఉద్యోగులను గ్రీన్ కార్డు జారీ చేయాలన్న నిబంధన ఎత్తివేయడం స్వాగతించదగ్గ పరిణామమని ఫౌండేషన్ పేర్కొన్నది.

English summary
Top seven Indian-based outsourcing companies in the US received fewer H-1B visas in 2016 as compared to 2015, and as a group their numbers dropped 37 per cent, according to a new report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X