వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వేచ్ఛ కోరుతూ న్యూయార్క్ వీధుల్లో 'నిపుల్ ఫ్రీ' ప్రచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: మగవాళ్లతో పాటు సమాన హక్కులు కోరుతూ మహిళలు ఆదివారం న్యూయార్క్ నగర వీధుల్లో ధర్నాకు దిగారు. ఇంతకీ ఏంటీ ఆ సమాన హక్కు అని అనుకుంటున్నారా? మగవాళ్లు నిక్కరు తప్ప ఒంటి పైభాగంలో ఎలాంటి ఆచ్చాదన లేకుండా తిరుగుతుంటే తాము మాత్రం 'నిపుల్స్ ఫ్రీ'గా ఎలాంటి అచ్చాదన లేకుండా ఎందుకు తిరగకూడదని అంటున్నారు.

ఇందులో భాగంగా బొడ్డు ఫైభాగం నుంచి తల వరకు ఎలాంటి ఆహార్యం లేకుండా వీధుల్లోకి వచ్చి ప్రదర్శన జరిపారు. మగవారితో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలంటూ కొత్త హక్కుల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ధర్నాలో పిల్లల నుంచి బామ్మల వరకు పాల్గొనగా, పురుషులు కూడా వారికి మద్దతుగా వారి వెంట వీధుల్లో నడిచారు.

మగవారు సైతం 'మీ స్వేచ్ఛకు మేము అడ్డు కాదు' అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ఒక్క అమెరికా నగరాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా 60 నగరాల్లో జరిగాయి. న్యూయార్క్ సిటీలో కాస్త ఆకర్షణీయంగా జరిగాయి. ఎక్కడ ధర్నా చేసిన ఫర్వాలేదుగానీ 'టైమ్ స్క్వేర్'కు మాత్రం రావద్దంటూ న్యూయార్క్ మేయర్ ఇచ్చిన ఉత్తర్వులను సైతం లెక్కచేయలేదు.

Topless protesters

1992 నుంచే 'టాప్‌లెస్'గా న్యూయార్క్ నగరంలో మహిళలు తిరిగేందుకు స్వేచ్ఛ ఉంది. అయితే ఇప్పుడు ప్రదర్శనలాగా నిర్వహించడం మాత్రం తమకు నచ్చలేదని న్యూయార్క్ మేయర్ బిల్ దే బాసియో, పోలీసు కమిషనర్ బిల్ బ్రాటన్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ డీసీలో ఉన్న దేశాధ్యక్ష భవనం ముందు కూడా మహిళలు ఈ ప్రదర్శన చేశారు.

అంతర్జాతీయ మహిళల సమానత్వం 95వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ 'టాప్‌లెస్' నిరసనకు హాలీవుడ్ తార, మోడల్ రాచెల్ జెస్సీ పిలుపునిచ్చారు. 'గో టాప్‌లెస్', 'నిపుల్ ఫ్రీ' పేరిట ఆమె ఇచ్చిన పిలుపుకు ప్రపంచంలోని 60 నగరాల్లో మహిళలు స్పందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

న్యూయార్క్ సిటీతోపాటు మన్‌హట్టన్, ఎడెన్‌బర్గ్ లాంటి అమెరికా నగరాల్లోనే ఈ కార్యక్రమానికి ఎక్కువ స్పందన లభించింది. మగవాళ్లతోపాటు తమకు టాప్‌లెస్ హక్కులు ఉండాలని గత కొంతకాలంగా రాచెల్ జెస్సీ డిమాండ్ చేస్తున్నారు. మగవారితో పోలిస్తే మహిళలు అన్ని రంగాల్లో అణిచివేతకు గురవుతున్నారని, ముందుగా తమ శరీర భాగాలకు స్వేచ్ఛను కలిగించాలని కోరుకుంటున్నామని అన్నారు.

English summary
Bare-chested protesters took to the streets of 60 cities around the world on Sunday as part of a campaign to 'free the nipple'. One of the biggest events for GoTopless Day was a semi-naked parade through New York City - where officials are debating whether topless tip-seekers should be allowed in Times Square.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X