వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ దేశం కకావికలం: ఐదేండ్ల తర్వాత అక్కడికి నియంత నేత - పొరుగున సౌత్, చైనాలోనూ ఆగమాగం

|
Google Oneindia TeluguNews

వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎంతో చెప్పలేదు.. కానీ ఇంటింటినీ దాదాపు సీజ్ చేసేశారక్కడ.. దేశవ్యాప్తంగా కరోనా ఎమర్జెన్సీ కొనసాగుతుండగానే ఉత్తరకొరియాను ప్రకృతి విలయం చుట్టుముట్టుంది. గడిచిన నాలుగైదు రోజులుగా కిమ్ దేశం భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతోంది. వందల సంఖ్యలో ఇండ్లు, వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న దేశాన్ని కొత్త ఉపద్రవం నుంచి గట్టెక్కించేందుకు నియంత నేత కిమ్ జాంగ్ అసాధారణ చర్యలకు దిగారు.

జమ్మూకాశ్మీర్ లో అనూహ్యం - తొలిసారి మహిళా జవాన్లకు డ్యూటీ - 370 రద్దుకు 366 రోజులుజమ్మూకాశ్మీర్ లో అనూహ్యం - తొలిసారి మహిళా జవాన్లకు డ్యూటీ - 370 రద్దుకు 366 రోజులు

5ఏళ్ల తర్వాత అక్కడికి కిమ్..

5ఏళ్ల తర్వాత అక్కడికి కిమ్..

ఉత్తరకొరియా అంతటా భారీ వర్షాలు కురుస్తుండగా వాంఘాయి ఫ్రావిన్స్ లో వరద తీవ్రత అధికంగా ఉంది. సౌత్ కొరియా, చైనాలోనూ కుండపోతగా వాన పడుతుండటంతో ఆ ప్రభావానికి నార్త్ సరిహద్దు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అధినేత కిమ్ జాంగ్ శుక్రవారం వాంఘాయి ఫ్రావిన్స్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించినట్లు నార్త్ అధికారిక మీడియా తెలిపింది. సౌత్ సరిహద్దును ఆనుకుని ఉండే వాంఘాయిలో కిమ్ పర్యటించడం 5ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అతి భారీ నష్టం..

అతి భారీ నష్టం..

గడిచిన ఐదు రోజులుగా కుండపోతలా కురుస్తోన్న వర్షాలకు, తద్వారా తలెత్తిన వరదలకు దేశం తీవ్రంగా ఎఫెక్ట్ అయిందని కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) తెలిపింది. ఒక్క వాంఘయి ఫ్రావిన్స్ లోనే అతి భారీ నష్టం జరిగిందని, వరద తాకిడికి సుమారు 730 ఇండిపెండెంట్ ఇండ్లతోపాటు 179 హౌజింగ్ కాంప్లెక్సులు ధ్వంసమయ్యాయని, 1480 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కూడా లెక్కిస్తే అంచనాలు ఇంకా పెరగొచ్చని కేసీఎన్ఏ చెప్పింది. అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలేవీ నార్త్ మీడియా వెల్లడించలేదు.

ఆర్మీని దించిన అధినేత..

ఆర్మీని దించిన అధినేత..


శుక్రవారం వాంఘయి ఫ్రావిన్స్ లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన అధినేత కిమ్ జాంగ్ యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే సైన్యం సహాయక చర్యలు చేపట్టాలని, తన మాటనే శాసనంగా భావించి.. నిర్వాసితులకు ఆహార, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు చెప్పారు. అంతేకాదు, ధ్వంసమైన ఇండ్ల స్థానంలో 800 మోడల్ హౌసింగ్ కాంప్లెక్సులను నిర్మించాలని తక్షణ ఆదేశాలు జారీ చేశారాయన. నిర్మాణ పనులను ఆర్మీనే చేపట్టాల్సి ఉంటుందని కిమ్ చెప్పినట్లు కేసీఎన్ఏ పేర్కొంది.

Recommended Video

North Korea లో కొనసాగుతున్న అణ్వాయుధ కార్యకలాపాలు.. వెలుగులోకి వచ్చిన ఐరాస రిపోర్టు! || Oneindia
నార్త్ పొరుగున సౌత్, చైనాలోనూ బీభత్సం..

నార్త్ పొరుగున సౌత్, చైనాలోనూ బీభత్సం..


ఉత్తరకొరియాతో సరిహద్దులున్న సౌత్ కొరియా, చైనాలోనూ గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు వరదల కారణంగా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సౌత్ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. నార్త్ కు కూడా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నా, అందుకు కిమ్ నుంచి అనుమతి లభించలేదని సౌత్ అధికారులు పేర్కొన్నారు. అటు చైనాలో ఈ ఏడాది వర్షాలు భారీ విలయాన్ని సృష్టించాయి. ఇప్పటికే 130 మంది ప్రాణాలు కోల్పోగా, 2.70లక్షల ఇండ్లు, లక్షలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. దాదాపు 4 కోట్ల మంది వరదకు ఎఫెక్ట్ అయినట్లు తెలిసింది.

English summary
Leader Kim Jong Un visited parts of southern North Korea where days of torrential rains have flooded hundreds of houses and vast areas of agricultural land. South Korea and china has also received heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X