వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకాకిగా మిగిలినా... ట్రంప్ బే ఫికర్... ఆ ప్రసంగం సరైందేనని సెల్ఫ్ సర్టిఫికెట్...

|
Google Oneindia TeluguNews

కేపిటల్ భవనంపై దాడి తర్వాత ఏకాకిగా మిగిలిన ట్రంప్‌లో ఇప్పటికీ ఏ మూలన కించిత్ పశ్చాత్తాపం,విచారం కనిపించట్లేదు. పైగా తన చర్యలన్నీ సరైనవేనని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు. ఈ నెల 6న కేపిటల్ భవనంపై దాడికి ముందు తాను చేసిన ప్రసంగం పూర్తిగా సరైనదేనని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతినిధుల సభలో తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదమని... ఇది ఆగ్రహ జ్వాలలకు కారణమవుతుందని హెచ్చరించారు.

ట్రంప్ ఏమన్నారంటే...

ట్రంప్ ఏమన్నారంటే...

మంగళవారం(జనవరి 12) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి మెరైన్ వ‌న్ విమానంలో టెక్సాస్‌ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్... బుధ‌వారం ప్రతినిధుల సభలో అభిశంస‌న తీర్మానం చ‌ర్చ‌కు రానుండ‌టంపై విమర్శలు గుప్పించారు. ఇది దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే మంత్ర‌గ‌త్తె మాదిరిగా తనను వేటాడ‌టం వంటిద‌ని అభిప్రాయ ప‌డ్డారు. తన వ్యాఖ్యలతో మద్దతుదారులను తిరుగుబాటుకు ప్రేరేపించారన్న ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు.

అది సరైందేనని ప్రజలు భావిస్తున్నారు : ట్రంప్

అది సరైందేనని ప్రజలు భావిస్తున్నారు : ట్రంప్

'ఆరోజు నా ప్రసంగాన్ని చాలామంది విన్నారు. నేను కూడా పత్రికల్లో,టెలివిజన్‌లో నా ప్రసంగాన్ని చూశాను,చదివాను.ఎంతోమంది ఆ ప్రసంగాన్ని విశ్లేషించారు. అది సరైనదేనని ప్రజలంతా భావిస్తున్నారు.' అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నెల 6న ట్రంప్ మద్దతుదారులంతా సేవ్ అమెరికా పేరుతో వాషింగ్టన్ డీసీలో ర్యాలీ చేపట్టడం,ఆపై కేపిటల్ భవనంపై దాడికి పూనుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో ఐదుగురు మృతి చెందారు. సోషల్ మీడియాలో ట్రంప్ తన ప్రసంగాలు,సందేశాలతో తన మద్దతుదారులను రెచ్చగొట్టడం వల్లే ఈ దాడి జరిగిందన్న ఆరోపణలున్నాయి.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు...

రెచ్చగొట్టే వ్యాఖ్యలు...

కేపిటల్ భవనంపై దాడికి ముందు తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేశారు. 'మీరు గట్టిగా పోరాడండి... చెడ్డవాళ్లను ఎదిరించండి... బలహీనంగా ఉంటే మీరు మన దేవాన్ని తిరిగి మన చేతుల్లోకి తీసుకోలేరు. కాబట్టి మీరు బల ప్రదర్శన చేయాలి.నాకు తెలుసు మీరంతా మీ గొంతు వినిపించేందుకు దేశభక్తితో శాంతియుతంగా క్యాపిటల్ భవనం వైపు మార్చ్ చేస్తారని..' అంటూ ట్రంప్ ఆరోజు రెచ్చగొట్టే రీతిలో ప్రసంగం చేశారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి సంబంధించిన ఆర్టికల్‌లో చేర్చారు. ఈ తీర్మానం బుధవారం సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

English summary
An unrepentant Donald Trump has denied inciting an insurrection at the US Capitol last week, claiming his speech before the violence was “totally appropriate.The president spoke to reporters for the first time since a pro-Trump mob rampaged through the Capitol last Wednesday, leaving five people dead. Democrats accuse him of stoking violence and could vote to impeach him on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X