వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా, అమెరికాల మధ్య కుదిరిన సయోధ్య...ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు

|
Google Oneindia TeluguNews

చైనా అమెరికా దేశాల మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వాణిజ్య యుద్దానికి తెరపడనుంది. రెండు దేశాలు తమ వాణిజ్య పన్నులపై అంగీకారానికి వచ్చారు. ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య యుద్దంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పలు సంస్థలు ఆందోళన చెందుతుండడంతో వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రెండు అగ్రదేశాలు ఒప్పందాన్ని కుదుర్చున్నాయి.

చైనా ,అమెరికా దేశాల మధ్య సయోధ్య కుదిరింది. గత కొద్ది రోజుల క్రితం ఇరు దేశాలు ఒక దేశం ఇంకోదేశం వస్తువుల ఉత్పత్తులపై పన్నులు విధించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా, చైనాకు చెందిన 250 బిలియన్ డాలర్ల వస్తువుల ఉత్పత్తులపై పన్నులు విధించింది. దీంతో అమెరికా పై ప్రతికారం తీర్చుకునేందుకు చైనా సైతం శ్రీకారం చుట్టింది. 110 బిలియన్ డాలర్ల వస్తువులపై చైనా సైతం పన్నులను విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్దానికి తెరతీసింది.

Trade deal between the United States and China

ప్రస్తుతం ఇరు దేశాలు మొదటి దశ వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. చైనాతో పలు ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అంగీకరించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే గతంలో చైనాపై విధించిన సుంకాలకు సంబంధించి స్టే విధిస్తున్నట్టు గా తెలిపారు. అయితే ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ ఒప్పందాలతో రెండు అగ్రదేశాలు దిగిరావడంతో పలు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.

English summary
China announced Friday a "phase one" trade deal with the United States that includes a progressive rollback of tariffs that have threatened to roil the global economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X