వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు భారీ షాక్ ఇవ్వనున్న డొనాల్డ్ ట్రంప్: యుద్ధానికి సంకేతమా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తమ మేథో సంపత్తిని దొంగిలించిందనే నెపంతో చైనాపై డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. చైనాపై భారీ జరిమానా విధించేందుకు సిద్ధం అవుతోంది. ఇది వాణిజ్య యుద్ధానికి తెరలేపుతోందా అనే ఆందోళన అందరిలో కనిపిస్తోంది.

ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ ఉద్భవించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. తమ మేథోసంపత్తిని చైనా దొంగిలించిందని భావిస్తున్న అమెరికా అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అమెరికా కంపెనీలను బలవంతం పెట్టి మేధో సంపత్తిని చైనా తనకు బదిలీ చేసుకుందని రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌, ఆయన ఆర్థిక సలహాదారుడు గ్యారీ కోన్‌లు ఆరోపించారు.

ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణిని విమానంలో నుంచి చూశారుఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణిని విమానంలో నుంచి చూశారు

భారీ జరిమానా విధిస్తాం

భారీ జరిమానా విధిస్తాం

ఈ విషయంపై అమెరికా వాణిజ్య విచారణ చేపట్టిందని కూడా వారు తెలిపారు. అమెరికా వాణిజ్య ప్రతినిధులు దీనిపై త్వరలోనే సిఫారసులు చేస్తారన్నారు. తాము పెద్ద మొత్తం మేధోసంపత్తి జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నామని, త్వరలోనే దీన్ని ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఎంత మొత్తంలో జరిమానా విధించనున్నారో తెలియాల్సి ఉంది.

బీజింగ్ అలా ఉండటం లేదు

బీజింగ్ అలా ఉండటం లేదు

చైనా చేసిన ఈ పనివల్ల టెక్నాలజీలో వందల బిలియన్‌ డాలర్లను కోల్పోయామని అమెరికా వాపోతోంది. మిలియన్ల ఉద్యోగాలు చైనీస్‌ కంపెనీలకు వెళ్లినట్టు తెలిపాయి. సాఫ్టువేర్లను, ఆలోచనలను బలవంతం మీద చైనీస్‌ కంపెనీలు తమ వద్ద నుంచి దొంగలించాయని ఆరోపిస్తున్నారు. చైనాతో సత్సంబంధాల కోసం తాము చూసినా బీజింగ్‌ అలా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు.

జరిమానాపై చైనా ఎలా

జరిమానాపై చైనా ఎలా

ఈ విషయంపై జనవరి 30న అమెరికా కాంగ్రెస్‌ వద్ద కూడా చర్చించనున్నట్టు పేర్కొన్నారు. అయితే ట్రేడ్ వార్‌ అనేది అమెరికా తీసుకోబోయే చర్యలపై ఆధారపడి ఉండనుందని అంటున్నారు. ట్రేడ్‌ వార్‌ సంభవించే అవకాశాలు లేవని ట్రంప్‌ చెబుతున్నప్పటికీ, జరిమానా పెద్ద మొత్తంలో విధిస్తే, ఈ విషయాన్ని చైనా కూడా సీరియస్‌గా తీసుకుంటుందని అంటున్నారు.

ఖండించిన చైనా

ఖండించిన చైనా

మరోవైపు, మేధో సంపత్తిని దొంగలించామనే అమెరికా ఆరోపణలను చైనా ఖండించింది. చైనాలో ఏ చట్టాలు కూడా బలవంతంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి టెక్నాలజీని బదిలీ చేసుకునేలా లేవని, కానీ కంపెనీల మధ్య మార్కెట్‌ ప్రవర్తన బట్టి అది ఆధారపడి ఉంటుందన్నారు.

English summary
US President Donald Trump said on Wednesday the United States was considering a big "fine" as part of a probe into China's alleged theft of intellectual property, the clearest indication yet that his administration will take retaliatory trade action against China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X