వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది మిమ్మల్ని అబ్బురపరుస్తుంది: బాతుల కోసం 3లైన్లలో నిలిచిన ట్రాఫిక్ (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అక్లాండ్: న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కొన్ని బాతులు నడి రోడ్డు పైన వెళ్తుండగా కార్లు ఆగిపోయాయి. అవి రోడ్డు దాటే వరకు మూడు వరుసల్లో కార్లను నిలిపివేశారు. దీంతో వెనుక పలు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటన గత శుక్రవారం జరిగింది.

అక్లాండ్‌లోని ఆ రహదారి నిత్యం ఎంతో బిజీగా ఉంటుంది. అలాంటి రోడ్డు పైన బాతులు వెళ్తుండగా కార్లను నిలిపివేశారు. దీనిని అక్లాండ్ ట్రాన్సుపోర్ట్ డిపార్టుమెంట్ తన ట్విట్టర్ అకౌంటులో షేర్ చేసింది.

ఉదయం ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా త్వరగా చేరుకునేందుకు వాహనాలను వేగంగా నడుపుతారు. ఆ సమయంలో ఆలస్యం చేస్తే ట్రాఫిక్‌లో చిక్కుకుంటామని భయపడతారు.

Traffic comes to a grinding halt as ducks cross busy highway

అలాంటి సమయంలో, ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు బాతు, దాని పిల్లలు అక్లాండ్‌లోని త్రిస్ట్రామ్ అవెన్యూ సమీపంలో రోడ్డు దాటుతున్నాయి. అయితే బాతు పిల్లల కోసం వేగంగా వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలు ఆగిపోయాయి. అక్లాండ్‌లో వారాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.

తొలుత ఓ వరుసలో వస్తున్న కారు డ్రైవర్ కారును ఆపేశాడు. దీంతో దాని వెనుక ఎన్నో వాహనాలు ఆగిపోయాయి. బాతులు రోడ్డుపై నుంచి అలాగే దాటుతూ ఉండగా మరో లైన్లో వచ్చిన కార్లు, ఆ తర్వాత మరో లైన్లోని వాహనాలు కూడా నిలిచాయి. మొత్తం మూడు లైన్లలో వాహనాలు నిలిచాయి. బాతులు రోడ్డు దాటాక వాహనాలు ముందుకు సాగాయి. ఆ తర్వాత ఓ ట్రాఫిక్‌ పోలీసు ఆ బాతులను సురక్షితంగా పక్కకు తరలించాడు.

English summary
In a video shared by the Aukland Transport's real time notifier on Twitter, the handle informed people took some extra time in their daily commute on the Northern Mwy as a mamma duck was crossing the road with her ducklings near Tristram Avenue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X