వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ వర్షాలు: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర విచారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ భారీ వరదలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ విపత్తుపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వరదల దాటికి మృతి చెందిన వారి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

'కేరళ ప్రకృతి అందాలను గురించి భారత దేశానికి వచ్చినప్పుడు విన్నాను. అంతటి గొప్ప ప్రదేశం ప్రస్తుతం వరదల గుప్పిట్లో చిక్కుకుంది. ఎంతో మంది మృతి చెందారు. వారందరికీ నా సంతాపం. వారందరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాల'ని ట్వీట్‌ చేశారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలు ఆహారం దొరకక, ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. గత వంద సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి.

Tragic news from Kerala, India: Justin Trudeau

ఈ విపత్తుతో కేరళ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి ఆహారం, నీరు లేక సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 350 మందికి పైగా మృతి చెందారు.

English summary
Tragic news from Kerala, India - Canada sends its deepest condolences to all those who have lost a loved one in the devastating floods. Our thoughts are with everyone affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X