వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రమత్తులో పైలట్...40 నిమిషాలు విమానం ప్రయాణం

|
Google Oneindia TeluguNews

అసలే ట్రైనీ పైలట్ విధుల్లోకి చేరేముందు రాత్రి సరైన నిద్రలేదు. దీనికితోడు ఉదయం టిఫిన్ చేయకుండానే ఒక చాక్లెట్ మరియు ఒక కూల్‌డ్రింక్స్ మాత్రమే తాగాడు. ఈ పరిస్థితుల్లో పైలట్ సీటులో కూర్చుకున్నాడు. ఇక విమానం ఎగిరిన కాసేపటికే సదరు ట్రైనీ పైలట్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో విమానం ఎలాంటీ కంట్రోల్ లేకుండా సుమారు 40 నిమిషాలపాటు ప్రయాణించింది. ఇది ఆస్ట్ర్రేలియాలోని అడిలైడ్ ఎయిర్‌పోర్టు గగనతలంలో జరిగింది.

సౌత్ ఆస్ట్ర్రేలియాలోని పోర్టు ఆగస్టా ఎయిర్ పోర్టు నుండి పారాఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే నిమిత్తం పైలట్ సోలో నావిగేషన్ ఫ్లైట్ ను తీశాడు. అయితే జలుబు, విశ్రాంతిలేకపోవడంతో పైలట్ ఇబ్బందిపడ్డాడు.దీంతో 55వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా తలనొప్పికి గురయ్యాడు. దీంతో విమానాన్ని ఆలోపైలట్‌లోపెట్టి నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఏటిఎస్ నుండి ఎటువంటి అనుమతి లేకుండానే విమానం అడిలైడ్ ఎటీసీ గగనతలంలోకి పరిధిలోకి ప్రవేశించాడు. దీంతో అప్రమత్తమైన ఏటీసీ సిబ్బంది పలుమార్లు ప్రయత్నించినా పైలట్ అందుబాటులోకి రాలేదు.

గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు భూకంపాలు: సునామీ భ‌యంతో వ‌ణికిన జ‌పాన్‌!గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు భూకంపాలు: సునామీ భ‌యంతో వ‌ణికిన జ‌పాన్‌!

Trainee Pilot Unconscious for 40 Minutes in flight

అయితే నలబై నిమిషాల తర్వాత పైలట్ సృహలోకి రావడంతో ఎట్టకేలకు మరోసారి ఏటిసి నుండి సమాచారం అందుకున్నాడు పైలట్. దీంతో ఆ విమానాన్ని పారాఫీల్డ్ విమానాశ్రాయంలో ల్యాండ్ చేశాడు. అయితే ఈ ఘటననను తీవ్ర చర్యగా పరిగణించిన ఆస్ట్ర్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టి బ్యూరో ఓ నివేదిక విడుదల చేసింది. ఈనేపథ్యంలోనే భద్రతా చర్యలపై ఎక్కువగా శ్రద్ద పెట్టనున్నట్టు అడిలైడ్ విమాన శిక్షణ సంస్థ ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టి బ్యూరో కు తెలిపింది. పైలట్ ఉదంతాన్ని తీసుకుని నిద్రకు సంబంధించి ట్రైనీ పైలట్ తగు సూచనలు చేయనున్నట్లు పేర్కోంది.

English summary
A trainee pilot flew unconscious for about 40 minutes through controlled airspace above Adelaide airport in Australia after he skipped breakfast on the morning of the flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X