వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మగాళ్ల జైల్లో ట్రాన్స్‌జెండర్: 2,000 సార్లు రేప్ చేశారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బ్రిస్బేన్: జైలులో ఓ ట్రాన్స్‌జెండర్ మహిళను 2000 సార్లు రేప్ చేసిన ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కారు దొంగతనం కేసులో మేరీ అనే ట్రాన్స్ జెండర్‌ బ్రిస్బేన్‌ లోని పురుషు జైల్లో నాలుగేళ్ల పాటు శిక్షను అనుభవించారు.

బ్రిస్బేన్‌లోని బోగ్గో రోడ్డు జైల్లో తాను నాలుగేళ్ల పాటు శిక్షను అనుభవించిన సమయంలో తనపై జరిగిన రేప్ గురించి ఆమె విడుదలైన అనంతరం వివరించారు. జైలులో ఇతర ఖైదీలు చేసే దాడుల నుంచి బయటపడేందుకు గాను తాను సెక్స్‌లో పాల్గొనాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

ఇలాంటి సమయంలోనే బాధితులు ఎంతో బాధను భరించాల్సి ఉంటుందని అన్నారు. జైల్లోని ఇతర ఖైదీల ఒత్తిడి మేరకు అలా చేయాల్సి వస్తోందని, అలా చేయని పక్షంలో తోటి ఖైదీలు దాడులకు సైతం పాల్పడతారని అన్నారు. 'జైల్లో బ్రతకాలంటే ఖైదీల చేతుల్లో రేప్‌కు గురి కావాల్సిందే. లేదంటే తోటి ఖైదీల చేతుల్లో దాడులు తప్పువు. అందుచేతనే అక్కడి ఖైదీల ఒత్తిడి మేరకు సెక్స్‌లో పాల్గొన్నాను' అని ఆమె నిర్మోహమాటంగా చెప్పుకొచ్చారు.

Transgender woman 'raped over 2,000 times' in Australia's male-only prison

కారు దొంగతనం కేసులో కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా ముందుగా జైలుకు తీసుకెళ్లారని అన్నారు. ఆ తర్వాత బాడీ చెకప్ కోసం దుస్తులు మొత్తం ఇప్పేయాల్సిందిగా జైలు అధికారులు కోరారని, ఇదంతా కూడా జైలులోని ఖైదీల ముందు చేయడంతో తానొక ట్రాన్స్‌జెండర్‌ అని అక్కడున్న వారికి తెలిసిందని ఆమె చెప్పారు.

దీంతో జైలులో తనపై హార్మోన్ల చికిత్స లాంటి భయంకరమైన టెస్టులను సైతం నిర్వహించారని అన్నారు. వారంలోనే తన జుట్టు పెరగడం ప్రారంమైందని ఇందుకు సాయం చేసేందుకు కూడా జైలు అధికారులు తిరస్కరించారని ఆమె చెప్పుకొచ్చారు. జైలులో తోటి ఖైదీలు చేసే దాడులు నుంచి తప్పించుకోవడానికి మూడు సార్లు జైలు నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించానని అన్నారు.

సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు విలువ లేదని, మేము కూడా సాధారణ మనుషులమేనని అందరిలాగే మేము కూడా జన్మించామని కానీ మాపై సమాజం దాడులు చేయడం ఎంతవరకు సమంజమని జైలు నుంచి నాలుగేళ్ల శిక్షను పూర్తి చేసుకుని విడుదలైన అనంతరం ఆమె ప్రశ్నించారు.

English summary
In a horrifying revelation, a transgender woman has confessed that she was raped more than 2,000 times in a male-only prison, where she was lodged on charges of theft, according to a report in the Daily Mail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X