వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం మొత్తంలో ఒక్కరే ఉంటే.... ఆ ఛాన్స్ ఆమెకే దక్కింది

|
Google Oneindia TeluguNews

విమాన ప్రయాణం అంటే అదేదో చాలా గొప్పగా భావిస్తాం. అదే మన ఒక్కరికోసమే ఒక విమానం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఒక వైపు భయం వేసినా మరో వైపు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇలాంటి అరుదైన అదృష్టమే ఫిలిప్పీన్స్‌కు చెందిన లూఈసా ఎరిస్పే అనే అమ్మాయికి దక్కింది. విమానం మొత్తానికి ఆమె ఒక్కతే ప్రయాణికురాలు అయినప్పటికీ అసలు బెదరలేదు... జంకలేదు. అదే మరొక యువతి ఉండి ఉంటే భయపడేదేమో.. లేక తన ప్రయాణాన్నే రద్దు చేసుకునేదేమో...

విమానంలో ఒక్కరే ప్రయాణికురాలు

విమానంలో ఒక్కరే ప్రయాణికురాలు

ఇక అసలు విషయానికొస్తే లూఈసా ఎరిస్పే గతేడాది డిసెంబరు 24 దావోస్ నుంచి మనీలాకు వెళ్లేందుకు పీఆర్2820 విమానంలో టికెట్ బుక్ చేసుకుంది. ప్రయాణ సమయం వచ్చింది. విమానంలోకి ఎంటర్ అయ్యింది. లోపలికి వెళ్లి చూడగా అంతా ఖాళీగా ఉంది. విమాన సిబ్బంది తప్ప ఒక్క ప్రయాణికుడు కూడా లేడు. దీంతో ఖంగు తినడం లూఈసా వంతైంది. ఆ విమానంలో తాను ఒక్కతే ప్రయాణికురాలు అని తీరా విమానం ఎక్కాక తెలుసుకుంది. మొదట్లో కొంచెం కంగారుపడినప్పటికీ...ఆ తర్వాత అంతా సర్దుకుంది. ఇక ఏముంది మహారాణిలా తానొక్కతే విమానం అంత కలియతిరిగింది. ఆడింది...పాడింది.. ఎగిరింది... ఆరోజు విమానం తనదే అన్నట్లుగా తెగ సంబరపడిపోయింది. సెల్ఫీలు తీసుకుంది. చాలా ఎంజాయ్ చేసింది.

ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు..వ

ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు..వ


ఫోటోలు తీసుకుని తన ఫేస్‌బుక్ పేజ్‌పై పోస్టు చేయడంతో పోస్టు కాస్త వైరల్ అయ్యింది. తను సిబ్బందితో కూడా అంటే పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌లు ఇతర సిబ్బందితో కలిసి ఫోటోలు దిగింది .వీటన్నిటినీ సోషల్ మీడియాలో పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకుంది. విమానంలో ఎవరూ లేరని తానే ఈ విమానానికి మహారాణి అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ఇక గమ్యస్థానం చేరుకోగానే విమాన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.

ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ పై నెటిజెన్లు ప్రశంసల వర్షం

ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ పై నెటిజెన్లు ప్రశంసల వర్షం

మొత్తానికి ఒక్క ప్రయాణికురాలితోనే ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ తీసుకోవడం పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఎంతమంది విమానంలో ఉన్నారనేదాన్ని పట్టించుకోకుండా ఒక్కరినైనా సరే గమ్యస్థానంకు చేర్చడంలో ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎంతటి కమిట్‌మెంట్‌తో పనిచేస్తుందో అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని పలువురు నెటిజెన్లు అభిప్రాయపడ్డారు. తమ నిబంధనలను అతిక్రమించకుండా ఉన్న ఒక్క ప్రయాణికురాలిని గమ్యస్థానం చేర్చిన ఫిలిప్పీన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు హ్యాట్సాఫ్ అంటూ కొందరు నెటిజెన్లు అభినందించారు.

English summary
Have you ever imagined having an entire aeroplane to yourself? For most people, this is a bizarre and highly improbable fantasy (unless you are royalty, of course), but for one woman from the Philippines, this actually came true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X