వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెట్లు రాత్రివేళల్లో ఆక్సిజన్ విడుదల చేస్తాయి:"ఐన్‌స్టీన్" ఇమ్రాన్ ఖాన్, ట్రోలింగ్ షురూ..!

|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ తెలసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారో అర్థం కాదు. తాజాగా రాత్రివేళల్లో చెట్లు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయంటూ వ్యాఖ్యానించి నవ్వులపాలయ్యారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలాంటి టాప్ యూనివర్శిటీలో చదువుకున్న ఇమ్రాన్ ఇలా మాట్లాడటమేంటని నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోను ఆదేశ జర్నలిస్టు నైలా ఇనాయత్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. మొత్తం 15 నిమిషాల విడిద ఉన్న ఈ వీడియోకు ఓ ఫన్నీ టైటిల్ కూడా ఆమె ఇచ్చారు. "రాత్రివేళల్లో చెట్టు ఆక్సిజన్ విడుదల చేస్తాయని చెప్పిన ఐన్‌స్టీన్ ఇమ్రాన్‌ఖాన్ " అంటూ ఆమె పోస్టు చేశారు. తక్కువ ఆదాయం కలిగి ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు సహాయం అందించే కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trees Produce Oxygen at night: Pak Pm Imran Khan once again trolled on social media

గత 10 ఏళ్లలో దాదాపు 70శాతం చెట్లను నరికివేశారని చెబుతూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్... దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి కొనసాగింపుగా గాలిని చెట్లు ప్యూరిఫై చేసి రాత్రి వేళల్లో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని చెప్పారు. అంతేకాదు చెట్లు కార్బన్ డైయాక్సైడ్‌ను కూడా పీల్చుకుంటాయని చెప్పారు. ఇక వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగానే ట్విటర్ పై నెటిజెన్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఓ ఆటాడేసుకున్నారు. గతంలో పాక్ ప్రధాని చేసిన కామెడీ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను జతచేస్తూ తాజా వ్యాఖ్యలు ఉన్న వీడియోను కూడా పోస్టు చేశారు.

కొందరు నెటిజెన్లు అయితే ఇమ్రాన్‌ఖాన్‌ను నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. కొందరైతే తమ పిల్లల బయాలజీ టెక్ట్స్ బుక్‌లో ఉన్న పాఠ్యాంశాన్ని ఫోటో తీసి పోస్టు చేశారు. మరికొందరైతే పాకిస్తాన్‌ కొత్త ప్రధానిని తక్కువగా అంచనా వేయకండి అంటూ రాసుకొచ్చారు. ఆయన చెప్పారంటే పాకిస్తాన్‌లో చెట్లు రాత్రివేళల్లో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయంతే అని సెటైర్లు వేశారు.

English summary
Once again, Khan has invoked a fresh laugh riot on social media after a video went viral where he can be heard claiming that trees produce oxygen at night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X