వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు ట్రబుల్స్: ఫోన్‌ సంభాషణలు రిలీజ్...బిడెన్‌ పై ఏమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బందులు తప్పవా..? ఇప్పటికే ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ స్పీకర్ నాన్సీ పలోసికి డెమొక్రాట్లు నోటిసు ఇవ్వడంతో ఆమె విచారణకు ఆదేశించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో జోబిడెన్ గురించి ట్రంప్ ప్రస్తావించారా..? తాజాగా బయటపడిన ఫోన్ సంభాషణల్లో ఏముంది...?

 ట్రంప్‌కు ఇబ్బందులు తప్పవా..?

ట్రంప్‌కు ఇబ్బందులు తప్పవా..?

అనుకున్నదంతా జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. 2020లో డెమొక్రాట్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న జోబిడెన్‌పై దుష్ప్రచారం చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ పై ట్రంప్ ఒత్తిడి తెచ్చారని డెమొక్రాట్లు ఆరోపించారు. ఆ ఆరోపణలు నిజమయ్యేలా ఉన్నాయి. జూలైలో ట్రంప్ జెలెన్‌స్కీతో మాట్లాడారు. ఆ ఫోను సంభాషణలు బయటకు వచ్చాయి. డెమొక్రాట్లు చేసిన ఆరోపణలు నిజమే అన్నట్లుగా తెలుస్తోంది.

 నేను క్విడ్‌ ప్రోకో కు పాల్పడలేదు

నేను క్విడ్‌ ప్రోకో కు పాల్పడలేదు

బుధవారం రోజున యూఎన్‌ జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జూలై 25న జరిగిన ఫోన్‌ సంభాషణల్లో ఎలాంటి క్విడ్ ప్రోకోకు తాను పాల్పడలేదని చెప్పారు. బిడెన్‌ పై దుష్ప్రచారం చేస్తే ఉక్రెయిన్‌కు సహాయం చేస్తామని తానెప్పుడూ చెప్పలేదని ఆ దేశానికి ఆర్థిక సహాయం చేయాలని ముందుగానే భావించినట్లు ట్రంప్ చెప్పారు. అయితే దేశంలో కుట్ర చేసేందుకు కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు గానీ క్విడ్‌ప్రోకోకు పాల్పడాల్సిన అవసరం లేదని ఎన్నో మార్గాలు ఇందుకు ఉన్నాయన్నారు హౌజ్‌ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మెన్ ఆడమ్ స్కిఫ్.

జోబిడెన్ కొడుకు హంటర్ అవినీతికి పాల్పడ్డాడు

జోబిడెన్ కొడుకు హంటర్ అవినీతికి పాల్పడ్డాడు

ఉక్రెయిన్‌లో భారీ అవినీతి జరిగిందని ఆ అవినీతిని రూపుమాపేందుకు తనవంతు సహకారం అందిస్తానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. తను బిడెన్, తన కొడుకు హంటర్‌పై దుష్ప్రచారం చేయాలని ఒత్తిడి తెచ్చిన మాట సత్యదూరమని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌ నుంచి జోబిడెన్ కుమారుడు కొన్ని మిలియన్ డాలర్లు తీసుకుని పారిపోతున్నాడని అది అవినీతే అవుతుందని ట్రంప్ చెప్పారు. ఇదే తరహా అవినీతికి చైనాలో కూడా తండ్రీ కొడుకులు తెరతీశారని ట్రంప్ ఆరోపించారు.

 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను జోక్యం చేసుకోను

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను జోక్యం చేసుకోను

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తను జోక్యం చేసుకోవడం ఇష్టం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. జోబిడెన్‌పై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం తనకు లేదని ఆ విధంగా తనపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడితో తాను ఫోన్‌లో మాట్లాడిన విషయాలు సాధారణమైనవని తేల్చి చెప్పారు.

ఫోన్‌ సంభాషణలు..

ఫోన్‌ సంభాషణలు..

బిడెన్‌ కొడుకు హంటర్‌ ఉక్రెయిన్‌లోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని అయితే ఆ సమయంలో తనపై విచారణ జరగకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారని.. ప్రజలు తన అవినీతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని ట్రంప్ జెలెన్‌స్కీతో చెప్పినట్లు ఫోన్ సంభాషణల్లో ఉంది. అయితే అటార్నీ జనరల్ సహాయంతో విచారణ చేయించాలని ట్రంప్ కోరినట్లు వైట్ హౌజ్ విడుదల చేసిన ఫోన్ సంభాషణల్లో ఉంది.

తన వ్యక్తిగత లాయరుతో మాట్లాడాలన్న ట్రంప్

తన వ్యక్తిగత లాయరుతో మాట్లాడాలన్న ట్రంప్

ఈ మొత్తం వ్యవహారంపై తన వ్యక్తిగత లాయర్ రూడీ గిలియానీతో మాట్లాడాలని ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ చెప్పినట్లుగా సంభాషణల్లో ఉంది. రూడీ ఉక్రెయిన్‌కు వస్తారని చెప్పగా ఆ సమయంలో తాను కలుస్తానని జెలెన్‌స్కీ తెలిపినట్లు ఫోన్ సంభాషణల్లో ఉంది. ఇక తనకు ఒక సహాయం చేయాలని ట్రంప్ జెలెన్‌స్కీని కోరినట్లు సంభాషణల ద్వారా తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో ప్రజలు ఎందుకు ధర్నాలకు దిగారు,2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా జోక్యం గురించి మొత్తం వివరాలు తనకు కావాలని ట్రంప్ అడిగినట్లుగా ఫోన్ సంభాషణల్లో ఉంది. అయితే ట్రంప్ ఉక్రెయిన్ పరిస్థితి పై ఎందుకు ఆరా తీశారో అనేది మాత్రం సంభాషణల్లో స్పష్టత లేదు.

English summary
A summary of a July phone call between U.S. President Donald Trump and Ukraine’s President Volodymyr Zelenskiy shows that Trump asked Ukrainian officials to investigate former Vice President Joe Biden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X