వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కష్టాల్లో ట్రంప్: పెద్దన్నకు అభిశంసన..సెనేట్‌లోనైనా గట్టెక్కేనా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Donald Trump Impeached By US House || Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రుజువవడంతో ఆయనపై ప్రజా ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా 230 ఓట్లు పడగా... అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి. అయితే ప్రజా ప్రతినిధుల సభలో ట్రంప్ ప్రత్యర్థి పార్టీ అయిన డెమొక్రటిక్ సభ్యులు మెజార్టీగా ఉన్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో అభిశంసన తీర్మానం ప్రక్రియ ముగియడంతో ఇక సెనేట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సెనేట్‌లో మెజార్టీ సభ్యులు రిపబ్లికన్లు ఉండటం విశేషం. ఇలా ఒక అధ్యక్షుడు అభిశంసన తీర్మానం ఎదుర్కోవడం అమెరికా రాజకీయ చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ మూడో వ్యక్తిగా నిలిచారు.

 ట్రంప్ చేసిన పనితో పార్టీపై మచ్చ

ట్రంప్ చేసిన పనితో పార్టీపై మచ్చ

అమెరికా భావాలను ప్రమాదంలోకి నెట్టివేశారని తమకు మరో ఛాయిస్ లేదని అన్నారు అభిశంసన తీర్మానంకు ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో సభ్యునిగా ఉన్న ప్రజాప్రతినిధి ఆడం స్కిఫ్. అభిశంసన తీర్మానం పై ఓటింగ్‌కు ముందు ఆయన మాట్లాడారు. ట్రంప్ పాల్పడిన పనికి పార్టీపై మచ్చపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక సెనేట్‌లో అభిశంసన తీర్మానంను ట్రంప్ ఎదుర్కోనున్నారు. అక్కడ మెజార్టీ సభ్యులు రిపబ్లికన్లు ఉండటం విశేషం. అయితే ట్రంప్ ఇక్కడ నిర్దోషిగా బయటపడే అవకాశం ఉంది.

 జోబిడెన్‌పై ట్రంప్ కుట్రపన్నారన్న ఆరోపణలు

జోబిడెన్‌పై ట్రంప్ కుట్రపన్నారన్న ఆరోపణలు

2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న డెమొక్రటిక్ అభ్యర్థి జోబిడెన్‌కు సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ ఫోన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది విజిల్ బ్లోయర్ బయటపెట్టారు. జోబిడెన్‌ను చెడ్డ చేసేందుకు ట్రంప్ కుట్రపన్నారని అందులో భాగంగానే జోబిడెన్ అతని కుమారుడు ఉక్రెయిన్‌లో ఉన్న సమయంలో వారు అవినీతికి పాల్పడ్డారని చెప్పాలంటూ ట్రంప్ ఒత్తిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక దీనిపై 10 గంటల పాటు ప్రజాప్రతినిధుల సభలో చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి.

రాజకీయ కక్షసాధింపే: ట్రంప్

రాజకీయ కక్షసాధింపే: ట్రంప్

తనపై వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమే అని ట్రంప్ ట్వీట్ చేశారు. తనను గద్దె దింపేందుకు ప్రత్యర్థులు ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు ట్రంప్. అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి అని చెప్పారు. ఇదిలా ఉంటే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన రోజున తొలి భాగం వైట్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. ట్వీట్ల ద్వారా తన ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే ఓటింగ్ సమయంలో మాత్రం సరదాగా కనిపించారు.

ట్రంప్‌కు అనుకూలంగా అభిమానుల నినాదాలు

ట్రంప్‌కు అనుకూలంగా అభిమానుల నినాదాలు

ట్రంప్ పై అభిశంసన తీర్మానం ఓటింగ్ జరుగుతున్న సమయంలో ప్రజలు వీక్షించేలా అమెరికాలో పెద్దస్క్రీన్లను ఏర్పాటు చేశారు. ట్రంప్‌కు అనుకూలంగా అభిమానులు నినాదాలు చేశారు. మరో నాలుగేళ్లు ట్రంప్ ఉండాలని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిశంసన తీర్మానం తర్వాత ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. డెమొక్రాట్లు విద్వేషంతో నిండి ఉన్నారని ట్రంప్ మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనకు ప్రయత్నిస్తుంటే లెఫ్ట్ భావజాలాలు ఉన్న డెమొక్రాట్ సభ్యులు తనపై అభాండాలు మోపి గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

English summary
President Donald Trump was impeached for abuse of power in a historic vote in the House of Representatives on Wednesday, setting up a Senate trial on removing him from office after three turbulent years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X