వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలపాగా తీసి బాలుడి ప్రాణాలు కాపాడిన ఆ సిక్కుకు భారీ బహుమతి(వీడియో)

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: సిక్కులు తమ సంప్రదాయంగా ధరించే తలపాగా(టర్బన్)ను తీసి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడిన హర్మాన్ సింగ్(22) అనే సిక్కుకు భారీ బహుమతి లభించింది. న్యూజిలాండ్‌ నివాసం ఉంటున్న హర్మాన్ సింగ్ ఓ బాలుడి రక్తస్రావాన్ని అపేందుకు తన తలపాగాను (టర్బన్) తీశారు. బాలుడు గాయంతో బాధపడుతుంటే ఆయన మతవిశ్వాసాన్ని పక్కన పెట్టి మానవత్వం చాటారు.

ఈ ఘటనతో హర్మాన్ అంతర్జాతీయంగా అన్ని మీడియాల్లోనూ ప్రధాన వార్తగా నిలిచారు. దీంతో ప్రపంచం వ్యాప్తంగా అతనిపై ప్రశంసలు కురిశాయి. కాగా, ఓ టీవీ స్టేషన్ మాత్రం ప్రశంసలతోనే సరిపెట్టకుండా భారీ బహుమానం పంపింది. అతని ఫ్లాట్‌లో ఫర్నీచర్ లేదని గుర్తించిన ఈ టీవీ స్టేషన్.. ఓ ట్రక్కు లోడ్ ఫర్నీచర్‌ను అతనికి బహుమతిగా పంపించింది.

Truckload of gifts for Sikh who broke protocol and cradled injured boy's head with turban

న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో హర్మాన్ సింగ్ నివాసముంటున్నారు. కాగా, తన సోదరితోపాటు వెళుతున్న ఓ ఆరేళ్ల బాలుడ్ని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయమై రక్త స్రావమైంది. అటుగా వెళ్తున్న హర్మాన్‌ సింగ్‌ (22) బాలుడి తల నుంచి రక్తం కారిపోతుండటంతో తన తలపాగాను తీసేసి అతడి తలకు చుట్టారు.

సిక్కు మతాచారం ప్రకారం బహిరంగంగా తలపాగా తీయకూడదు. ఆ విషయం తనకు తెలిసినా పసివాడి ప్రాణం కాపాడేందుకే అలా చేశానని హర్మాన్‌ చెప్పారు. ఆ సమయంలో తాను సంప్రదాయం గురించి ఆలోచించలేదని, బాలుడి ప్రాణాలు కాపాడాలని మాత్రమే చూశానని హర్మాన్ సింగ్ చెప్పారు.

కాగా, హర్మాన్ సింగ్ ఘటన పైన న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మత ధర్మాల ప్రకారం టర్బన్ తీయడం చాలా పెద్ద తప్పని, వాటిని మరిచి మానవత్వం చూపిన హర్మాన్ అభినందనీయుడని కొనియాడింది. హర్మాన్ టర్బన్‌ను తీస్తున్న సమయంలో అక్కడ ఉన్న మరో యువకుడు ఫోటో తీసి సామాజిక అనుసంధాన వేదికల్లో ఉంచాడు. దీంతో అతని గురించి భారీగా ప్రచారమైంది.

భారతదేశంలోని లూథియానాకు చెందిన హర్మాన్ సింగ్ ఉన్నత చదువుల కోసం న్యూజిలాండ్ వెళ్లారు. కాగా, ఈ ఘటనతో అతని గురించి అన్ని మీడియాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాయి. అదే విధంగా ఓ టీవీ స్టేషన్ కూడా అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించి, అతని ఫ్లాట్‌లో కేవలం 4 ప్లాస్టిక్ కూర్చీలు మాత్రమే ఉన్నాయని గుర్తించింది.

మానత్వం చాటుకున్న హర్మాన్ సింగ్‌కు పూర్తి ఫర్నీచర్ ఇవ్వాలని తలచి.. అతని తలుపు ముందు ఓ ట్రక్ ఫర్నీచర్ తెచ్చి ఉంచింది ఆ టీవీ స్టేషన్. దీంతో హర్మాన్ సింగ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా, అతని ఫ్లాట్‌మెట్ రవి, లిలీలు ఫర్నీచర్‌ను ఫ్లాట్‌లో పెట్టేందుకు అతనికి సహకరించారు.

‘ఎంతో సంతోషం వేసింది. కృతజ్ఞతలు, ధన్యవాదాలు' అని భావోద్వేగంతో ఈ భారీ ఫర్నీచర్ బహుమతిని హర్మాన్ సింగ్ తీసుకున్నారు. తన జీవితంలో ఇది చాలా పెద్ద ఆశ్చర్యమైన ఘటన అని తెలిపారు. కాగా, మానవత్వాన్ని చాటేందుకు తలపాగా తీసిన హర్మాన్ సింగ్‌ను మత పెద్దలు కూడా మెచ్చుకున్నారు.

English summary
Harman Singh, who made international headlines after he broke religious protocol by taking off his turban to help a profusely bleeding child in New Zealand, has been presented with a truckload of new furniture for his sparsely decorated flat by a TV station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X