వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం... హెచ్‌-1బీ జీవిత భాగస్వాములకు ఇబ్బందులే

హెచ్‌-1బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: హెచ్‌-1బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనుంది.

హెచ్‌-1బీ వీసాల జారీ కఠినతరం చేసేందుకు ఇప్పటికే అమెరికా పలు ఆంక్షలను విధిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఇటీవలే అమెరికా కాంగ్రెస్‌ చట్ట సభలో బిల్లును ప్రవేశపెట్టగా.. అందుకు ఆమోదం ముద్ర కూడా పడింది.

trump

ఇప్పుడు మళ్లీ ట్రంప్‌ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) అధికారికంగా వెల్లడించింది.

ట్రంప్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న 'బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌' పాలసీ విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నిబంధన తీసుకురావడానికి గల కారణాలను డీహెచ్‌ఎస్‌ వెల్లడించలేదు.

2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్‌-1బీ వీసాదారులు, గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న భార్య లేదా భర్త అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు అర్హులుగా నిబంధన తీసుకొచ్చారు.

ఇలాంటి వాళ్లు ఉద్యోగాలు చేసుకునేందుకు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసా కింద ఒబామా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఒబామా తీసుకొచ్చిన ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లోనే 'సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ' అనే బృందం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ నిబంధన అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీస్తుందని 'సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ' బృందం తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ విధానానికి ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పుడు ముగింపు పలకనుంది.

ఇలా చేయడం వల్ల హెచ్‌-1బీ వలసదారుల జీవిత భాగస్వాములు యూఎస్‌లో ఉద్యోగాల చేయడం కష్టతరమవుతుంది. దీనితో పాటు హెచ్‌-1బీ వీసా నిబంధనల్లోనూ మార్పులు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

English summary
In what will make the H-1B visa regime stricter, the US government has decided to repeal an Obama era rule that allowed spouses of H-1B visa holders to work in the US. The move — even though it will impact only a small percentage of H-1B visa holders who were in the running for a Green Card — is being deemed by the Indian industry as restrictive. In a statement issued on Thursday, the US Department of Homeland Security (DHS) said it intends to do away with that rule without too many details behind the decision. It just said that the move is in accordance with the Donald Trump administration's 'Buy American, Hire American' policy stance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X