వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఇండియన్ టెక్కీలకు కష్టాలే: భార్యాభర్తల్లో ఒకరికే 'జాబ్'..

ట్రంప్ ప్రభుత్వం గనుక ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే.. వేలాది మంది భారతీయుల భార్యలు ఉపాధి కోల్పోవడమే గాక అమెరికా నుంచి వారిని బయటకు పంపించడ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ అమెరికన్లే ఎక్కువ ఉద్యోగాలు పొందేలా కృషి చేస్తానని గత ఎన్నికల్లో హామి ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్.. ప్రస్తుతం ఆ దిశగానే ఆ అడుగులు వేస్తున్నారు. ట్రావెల్ బ్యాన్, వీసాలపై ఆంక్షలతో విదేశీయులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హెచ్1-బి వీసా కలిగిన ఉద్యోగుల భార్యలు/భర్తలు హెచ్4 వీసాతో అక్కడ ఉపాధి పొందుతున్నట్లయితే.. భవిష్యత్తులో దాన్ని నిలిపివేసే ప్రమాాదం పొంచి ఉంది. ఈ మేరకు గతంలో ఒబామా అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపేయాలని కోరుతూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ వంటి సంస్థలు కోర్టుకెక్కుతున్నాయి.

కాగా, కొత్త అధ్యక్షుడి యంత్రాంగం దీనిపై నిర్ణయం తీసుకోవడానికి 6నెలల గడువు కావాలని ఫిబ్రవరి 1న అమెరికా డిపార్ట్ మెంట్ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా సర్క్యూట్‌ కోర్టులో అప్పీల్ చేసింది.

ఒబామా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ:

ఒబామా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ:

అయితే ఒబామా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు వాషింగ్టన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించడంతో దీనిపై ట్రంప్ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందిగా పిటిషనర్లకు కోర్టు ఆదేశించింది. ట్రంప్ ప్రభుత్వం గనుక ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే.. వేలాది మంది భారతీయుల భార్యలు/భర్తలు ఉపాధి కోల్పోవడమే గాక అమెరికా నుంచి వారిని బయటకు పంపించడం ఖాయం.

సేవ్ జాబ్స్ యూఎస్ఏ:

సేవ్ జాబ్స్ యూఎస్ఏ:

అమెరికన్ సిటిజెన్స్ కే ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశ్యంతో గతంలో ఒబామా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ స్థానిక కోర్టులో దీన్ని సవాల్ చేసింది.

అయితే కోర్టులో ప్రతికూలంగా స్పందించడంతో ఒబామా రూల్ అమలులోకి వచ్చింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఆ ఉత్తర్వులను నిలిపివేస్తేనే అమెరికన్స్ సిటిజెన్స్ కు ఉద్యోగాలు దక్కుతాయని యూఎస్ సేవ్ జాబ్స్ వాదిస్తోంది.

ఇండియన్స్ లో ఆందోళన:

ఇండియన్స్ లో ఆందోళన:

హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు వెళ్లిన వారి జీవితభాగస్వాములకు వర్క్‌ పర్మిట్‌ రద్దు చేయాలని అమెరికన్ సంస్థలు కోరుతుండటంతో అక్కడి ఇండియన్స్ లో ఆందోళన నెలకొంది. గత 13ఏళ్లుగా అమెరికాలోని బయోమెడికల్ రీసెర్చిలో తాను పనిచేస్తున్నట్లు ఆమె చెప్పారు. తొలుత జే-2 డిపెండెంట్ గా అమెరికాలో ఉద్యోగానికి అనుమతి పొందిన తాను ఆ తర్వాత హెచ్-1బి వీసాతో అక్కడ పనిచేస్తున్నట్లు తెలిపారు.

స్టార్టప్ లకు కూడా అనుమతి ఉండదు:

స్టార్టప్ లకు కూడా అనుమతి ఉండదు:

ట్రంప్ ప్రభుత్వం గనుక ఈ నిర్ణయానికి తలొగ్గితే హెచ్4 వీసాతో అక్కడ అడుగుపెట్టినవారు స్టార్టప్స్ ఏర్పాటుకు అర్హత కోల్పోతారు. అంతేకాదు వారిని యూఎస్ నుంచి పంపించేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భార్యలు ప్రస్తుతం తమ ఉద్యోగాలు, బిజినెస్ లపై గగ్గోలు పెడుతున్నారు.

English summary
The Trump Administration has sought 60 days to respond to a court case that challenges the decision of the previous Obama Administration to authorise spouses of H1-B spouses to work in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X