వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ టెక్కీలకు గుడ్ న్యూస్.. మెరిట్ బేస్డ్ గ్రీన్ కార్డులను 57 శాతానికి పెంచనున్న అమెరికా..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : భారత ఐటీ నిపుణులకు శుభవార్త అందింది. గత కొంతకాలంగా వలసల విషయంలో ఆంక్షలు విధిస్తున్న అగ్రరాజ్యం గ్రీన్ కార్డుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిభ ఆధారంగా ఉద్యోగులకు ఇచ్చే గ్రీన్ కార్డుల కోటాను 12 నుంచి 57శాతానికి పెంచేందుకు సిద్ధమమైంది. ఈ మేరకు ట్రంప్ సీనియర్ అడ్వైజర్ జారెడ్ కష్నర్ వైట్ హౌస్‌లో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ప్రకటన చేశారు.

ట్రంప్ చేపట్టిన వలస సంస్కరణల ప్రాజెక్టుకు కష్నర్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే కాంగ్రెస్ ముందుకు రానుంది. కొత్త విధానం ద్వారా ప్రతిభ ఉన్నవారు గ్రీన్ కార్డులు పొందే అవకాశముంటుందని, దీంతో పాటు వచ్చే పదేళ్లలో అమెరికా పన్ను ఆదాయం 500బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నది కుష్నర్ అభిప్రాయం.

Trump administration mulls increasing merit-based immigration

అమెరికాలో ప్రస్తుతం అమలవుతున్న వలస విధానం చాలా పాతది. ఈ విధానంలో ప్రతిభ ఆధారంగా కేవలం 12శాతం మందికి మాత్రమే గ్రీన్ కార్డులు ఇస్తున్నారు. అయితే కెనడాలో ఇది 53 శాతం ఉండగా, న్యూజిలాండ్‌లో 59, ఆస్ట్రేలియాలో 63, జపాన్‌లో 52శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోనూ దీన్ని 57శాతానికి పెంచాలని ట్రంప్ ప్రతిపాదించారు.

దాదాపు ఐదున్నర దశాబ్దాల క్రితం అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. ప్రస్తుత విధానం వల్ల నైపుణ్యం కలిగిన యువతకు అవకాశాలు లభించడంలేదని, అందుకే కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. తాజా నిర్ణయం హెచ్ 1బీ వీసాతో అమెరికాకు వెళ్లి గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత టెక్కీలకు మేలు చేకూర్చనుంది.

English summary
Trump administration is proposing a nearly five-fold increase in merit-based legal immigration and half those based on family and humanitarian system, in an effort to overhaul the outdated system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X