వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కోటి మందికి ముప్పు.. బిక్కుబిక్కుమంటున్న 3 లక్షల మంది ఇండియన్-అమెరికన్లు

అమెరికాలో అక్రమంగా ఉంటున్న కోటి పది లక్షల మంది వలసదారులను దేశం నుంచి బయటికి పంపించేందుకు డొనాల్డ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు హోమ్ లాండ్ సెక్యూరిటీ అధికారులకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న కోటి పది లక్షల మంది వలసదారులను దేశం నుంచి బయటికి పంపించేందుకు డొనాల్డ్ ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో అక్రమంగా ఉంటూ దేశ భద్రతకు సవాలు విసిరే నేరస్తులే తమ మొదటి లక్ష్యమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ మేరకు హోమ్ లాండ్ సెక్యూరిటీ అధికారులకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో హోమ్ లాండ్ సెక్యూరిటీ శాఖ ఇప్పటికే తన పని కూడా మొదలుపెట్టేసింది. ఎవరైనా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అనుమానం వస్తేచాలు.. వారిని అరెస్టు చేసే అధికారం కూడా ఈ డిపార్ట్ మెంట్ అధికారులకు ఇచ్చారు.

Trump administration outlines sweeping immigration crackdown

అమెరికా ప్రభుత్వ తాజా ఆదేశాలతో సరైన పత్రాలు లేకుండా ఉంటున్న కోటి మందికి పైగా వలసదారులు బిక్కుబిక్కుమంటున్నారు. వీరిలో 3 లక్షల మంది ఇండియన్-అమెరికన్లు ఉన్నట్లు అంచనా.

ఇకనుంచి ఇలాంటి వారిని ఏరివేయడంలో క్లాసులు, కేటగిరీలు వంటివి ఏవీ ఉండవని హోమ్ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ రెండు ఎన్ ఫోర్స్ మెంట్ మెమోలు జారీ చేసింది.

ప్రస్తుతానికి క్రిమినల్ కేసులున్న అక్రమ వలసదారులే తమ లక్ష్యమని చెబుతున్నప్పటికీ.. అనంతర కాలంలో అందరూ దేశం వదిలి వెళ్లాల్సిందేనని ఆ శాఖ చెప్పింది. గాలింపులో పట్టుబడిన వారిపై కేసులు పెట్టనున్నారు.

ఒకవేళ వారు తాము మళ్లీ అక్రమంగా అమెరికాలోకి అడుగుపెట్టమని హామీ ఇస్తే.. వారు ఏ దేశాల నుంచి వచ్చారో అక్కడికి తిరిగి పంపించి వేస్తారు... అయితే వారిపై కేసుల విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.

అయితే ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలను డెమెక్రాట్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఆదేశాలపై వెంటనే విచారణ జరిపించాలని ఇల్లినాయిస్ డెమెక్రటిక్ సెనేటర్ డిక్ డర్బిన్.. ఇమ్మిగ్రేషన్ సబ్ కమిటీ చైర్మన్ జాన్ కార్నిన్ ను డిమాండ్ చేశారు.

హోమ్ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన మెమోల ప్రకారం.. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని జడ్జి ఎదుట హాజరుపరచాల్సిన అవసరం లేకుండానే దేశం నుంచి పంపించివేయవచ్చని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బెత్ వెర్లిన్ పేర్కొన్నారు.

English summary
The Trump administration outlined a sweeping crackdown on undocumented immigrants Tuesday, Homeland Security Secretary John Kelly said in one memo that it “implements new policies designed to stem illegal immigration and facilitate the detection, apprehension, detention and removal of aliens who have no lawful basis to enter or remain in the United States.” The Trump administration has expanded the priority list to include lower-level offenders, and the Homeland Security department said in a fact sheet that any person who is in the U.S. illegally is potentially subject to deportation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X