హెచ్1బీ వీసా కలిగిన వారి భాగస్వాములకు ట్రంప్ త్వరలో షాక్! భారతీయులే ఎక్కువ
వాషింగ్టన్: అమెరికాలో హెచ్1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంది. త్వరలో దీనికి ముగింపు పలకాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.
Recommended Video
హెచ్1బీ వీసాదారుల భాగస్వాముల హెచ్4 వీసాతో ఉద్యోగం చేస్తుంటారు. దీనిని తీసుకు వస్తే దాదాపు 70,000 మంది హెచ్4 వీసాదారులపై ప్రభావం పడనుంది. చట్టబద్దంగా దీనిని నిషేధించే యోచనలో అమెరికా ప్రభుత్వ ఉందని తెలుస్తోంది.
చట్టబద్ధంగా తొలగించే యోచన
చట్టబద్ధంగా దీనిని నిషేధించే యోచనలో ఉన్నట్లుగా ఫెడరల్ ఏజెన్సీ ఉన్నతాధికారి చట్ట సభ సభ్యులకు తెలిపారు. ఇదే జరిగితే భారతీయులకు ఇబ్బందికరమే. బరాక్ ఒబామా హయాంలో హెచ్1బీ వీసా హోల్డర్లకు ఈ అవకాసం కల్పించగా దానికి ముగింపు పలకాలని ట్రంప్ సర్కార్ ఆలోచన చేస్తోంది.
వేసవి అనంతరం అధికారిక ఉత్తర్వులు
అమెరికాలో హెచ్1బీ హోల్డర్ల జీవిత భాగస్వాములు సుమారు డెబ్బై వేల మందికి ప్రస్తుతం వర్క్ పర్మిట్లు ఉన్నాయి. ప్రధానంగా ఒబామా హయాంలో తీసుకు వచ్చిన ఈ ఆదేశాలతో ఎక్కువ ప్రయోజనం పొందింది భారతీయులు. దీనిని రద్దు చేస్తూ వేసవి అనంతరం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఆమెరికా పౌర, వలస సేవల విభాగం డైరెక్టర్ ఓ లేఖలో సెనేటర్ చుక్ గ్రాస్లేకు తెలిపారు.
లబ్ధిదారుల్లో భారతీయులు ఎక్కువ
2015లో ఒబామా ప్రభుత్వం దీనిని తీసుకురాగా లాభం పొందిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. హెచ్4 డిపెండెంట్ భాగస్వాములను ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ అర్హత నుంచి తొలగించే యోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు.
71వేల మందిలో భారతీయులే 90 శాతం మంది
యునైటెడ్ స్టేట్స్ వర్కర్స్ ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త గైడ్ లైన్స్ ఉంటాయని తెలిపారు. కాగా, ఇటీవలి నివేదిక ప్రకారం 71వేల మంది హెచ్1బీ వీసా భాగస్వాములకు అమెరికా పర్మిట్ ఇచ్చింది. ఇందులో 90 శాతం మంది భారతీయులు.