వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త:ట్రంప్ తో భారత్ కు మేలే, అమెరికాకు భారత్ అవసరం ఉంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గంతో భారత్ కు ప్రయోజనమేనని భారతీయ వ్యాపార మండలి తెలిపింది. భారత్ అమెరికాల మద్య సంబందాలకు ట్రంప్ పరిపాలన వర్గం సహకరిస్తోందని అభిప్రాయపడింది యూఎస్ఐబిసి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గంతో భారత్ కు ఎంతో మేలు చేకూరనుందని అమెరికాలోని ప్రముఖ భారతీయ వ్యాపార మండలి (యూఎస్ ఐ బిసి ) తెలిపింది.

అమెరికాలోని యూఎస్ ఐబిసి ప్రముఖ వ్యాపార విభాగంగా పనిచేస్తోందని , ఆ సంస్థ అధ్యక్షుడు ముఖఏస్ ఆఘే శుక్రవారం నాడు మీడియాకు చెప్పారు.

అమెరికాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జియో పొలిటికల్ విధానంలో భారత్ కూడ కాస్తంత ఆందోళనకరమైన పరిస్థితుల మధ్య ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి కూడ వాషింగ్టన్ అవసరం ఉంది. ఇప్పటివరకు భారత్ అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను బట్టి చూస్తే ట్రంప్ పరిపాలన వర్గం భారత్ కు చాలా ఉపకరిస్తోంది.

donald trump

భారత ఆర్థిక శ్రేయస్సు అనే అంశం అమెరికాకు మేలు చేయనుంది. భారత్ తనను తాను సమర్థంగా రక్షించుకోగల సైనిక బలాన్ని నానాటికి పెంచుకొంటూ పోతోంది. ఈ రెండు అంశాలు అమెరికా భారత్ వైపు చూసేందుకు కారణంగా ఆయన చెప్పారు.

అలాగే భారత్ కూడా అమెరికాను బలమైన దేశంగా నమ్ముతోంది. ట్రంప్ పాలన వర్గం మోడీ ప్రభుత్వం మధ్య బలమైన సానుకూల ఒప్పందాలు జరుగుతాయని తాను అనుకొంటున్నానని చెప్పారు. ఈ ఏడాది తర్వాత వీరిద్దరి సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు.

English summary
The Trump administration would be good for India as Washington sees New Delhi as a stabilising factor in the region, a top US industry body has said."I think US needs India for its presence in the region itself," Mukesh Aghi, president of US India Business Council (USIBC), a representative body of top American businesses having a footprint in India, said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X