వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాలెట్ ఓట్లు ఆశ్చర్యం కలిగిస్తోన్నాయి.. డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో బ్యాలెట్ కౌంటింగ్‌పై డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. తాను లీడ్‌లో ఉన్న చోట బ్యాలెట్ లెక్కింపుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇదీ తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ట్రంప్ అన్నారు. అంతేకాదు బ్యాలెట్ లెక్కింపు ముమ్మాటికీ తప్పుదోవ పట్టించడమేనని ట్వీట్ చేశారు.

 Trump Alleges Surprise Ballot Dumps in States Where He Was Leading

వాస్తవానికి పోలింగ్ ఓట్లను లెక్కించిన తర్వాత తానే గెలిచానని పేర్కొన్నారు. దీంతో రగడ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్/ మెయిల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే ట్రంప్ ఆధిక్యంలో ఉన్న చోట ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఆయాచోట్ల బిడెన్‌కు అనుకూలంగా ఉండటం కూడా మరో కారణం. అయితే ట్రంప్ చేస్తోన్న ఆరోపణలకు సమాధానం మాత్రం లేదు.

అయితే మెయిల్ ఓట్లను లెక్కించిన ప్రతీసారి వారి శాతం పెరుగుతుందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇటు విస్కాన్సిన్‌లో రీ కౌంటింగ్.. మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపు ఆపాలని పిటిషన్ వేశారు. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరింత ఉత్కంఠగా మారింది.

మరోవైపు విన్సిస్కాన్, అరిజోనాలో బిడెన్ విజయం సాధించారు. మిచిగాన్‌లో లీడ్‌లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్.. ఎలక్టొరల్ కాలేజీ కలిపి బిడెన్‌ ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి బిడెన్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. బిడెన్ 270 చోట్ల లీడ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

English summary
President Donald Trump, which said "surprise ballot dumps" were being found in hotly contested states during the presidential election, as disputed and possibly misleading.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X