వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచార పర్వంలో ట్రంప్, జో బిడెన్ బిజీ బిజీ.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా..

|
Google Oneindia TeluguNews

మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. వర్చువల్ ప్రచారంతోపాటు ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ఎందుకు ఓటేయలంటే అంటూ.. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ వివరిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇద్దరూ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

మిచిగాన్, విస్‌కొన్సిన్, మిన్నెసొటాలో ట్రంప్ శుక్రవారం ప్రచారం చేశారు. తమకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెబుతున్నారు. లొవా, విస్కిన్సిన్, మిన్నెసోటలో బిడెన్ కూడా ప్రచారం చేశారు. వర్చువల్, జూమ్ యాప్ ద్వారా కూడా క్యాంపెయిన్ చేస్తుండగా... వర్చువల్‌గా కూడా చేస్తున్నారు.

Trump and Biden intensify their election campaigns..

అరిజొనాలో మైక్ పెన్స్.. టెక్సాస్‌లో కమలా హ్యరిస్ ప్రచారం చేశారు. ఇటు ట్రంప్ కుటుంబసభ్యులు కూడా ప్రచారబరిలో మునిగిపోయారు. కూతుర్లు ఇవాంక ట్రంప్, టిఫానీ, కుమారులు ఎరిస్, డొనాల్డ్ జూనియర్ ట్రంప్ కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే ట్రంప్ ప్రచార సందర్భంగా సామాజిక దూరం పాటించడం లేదు. కొన్ని చోట్ల మాస్క్‌ ధరించలేదు. మరికొన్ని చోట్ల మాస్క్ వేసుకున్నారు. అయితే బిడెన్ మాత్రం సామాజిక దూరం ఉండేలా చూసుకుంటున్నారు.

బిడెన్ ప్రజలను ఆకట్టుకోవడం లేదని ట్రంప్ ఆరోపించారు. అందుకు బిడెన్ కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తించేందుకు ట్రంప్ ప్రచారం దోహదపడుతోందని బిడెన్ అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణం అని మండిపడ్డారు. ఎన్నికల సమయం సమీపించడంతో.. అభ్యర్థులు ప్రచారం కోసమే తమ సమయాన్ని కేటాయిస్తున్నారు.

English summary
us president donald trump and his democratic rival joe biden have intensified thie poll campaings for the november 3 presidential elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X