వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్.. మెరిట్ బేస్డ్ గ్రీన్‌కార్టు కోటా పెంచిన ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ఐటీ నిపుణులకు మేలు చేసేలా డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రకటించారు. గ్రీన్‌కార్డుల జారీలో నైపుణ్యానికి ప్రాధాన్యమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెరిట్ బేస్ట్ గ్రీన్ కార్డు కోటాను పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.

అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ..! చైనా పై తీవ్ర ప్రభావం చూపనున్న ట్రంప్ నిర్ణయం..!!అమెరికాలో నేషనల్‌ ఎమర్జెన్సీ..! చైనా పై తీవ్ర ప్రభావం చూపనున్న ట్రంప్ నిర్ణయం..!!

గ్రీన్‌కార్డ్ కోటా పెంపు

గ్రీన్‌కార్డ్ కోటా పెంపు

తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం 12 శాతంగా ఉన్న మెరిట్ బేస్డ్ కోటాను ట్రంప్ 57శాతానికి పెంచారు. తద్వారా అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు మాత్రమే అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేలా యూఎస్ ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు చేసింది. దీని ప్రకారం అమెరికాకు వచ్చే వలసదారులు కొన్ని పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది.

 నైపుణ్యానికి ప్రాధాన్యం

నైపుణ్యానికి ప్రాధాన్యం

కొత్త విధానంలో వ్యక్తుల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఇంగ్లీష్ భాషపై పట్టు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పాయింట్లు ఇవ్వనున్నారు. వీటితో పాటు అమెరికా చరిత్ర, సంస్కృతి తదతర అంశాలపై నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. 54ఏళ్ల క్రితం నాటి అమెరికా వలస విధానంలో చేసిన మార్పులతో నిపుణులైన యువతకు మెరుగైన అవకాశాలు దక్కుతాయని ట్రంప్ అంటున్నారు. నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా అమెరికా వచ్చే వారికి ఎప్పుడూ తలుపులు తెరిచి ఉంటాయని ప్రెసిడెంట్ స్పష్టం చేశారు.

57శాతానికి చేరనున్న కోటా

57శాతానికి చేరనున్న కోటా

అమెరికాలో ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రీన్‌కార్డు జారీ విధానం ప్రకారం... యూఎస్‌లో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునేవారికి 60శాతం గ్రీన్ కార్డులు ఇస్తున్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారికి కేవలం 12శాతం కోటా మాత్రమే కేటాయించారు. తాజా నిర్ణయంతో ఆ కోటా 12 నుంచి 57శాతానికి పెరగనుంది. అవసరమైతే ఈ కోటాను మరింత పెంచుతామని ట్రంప్ తేల్చి చెప్పారు. మెరిట్ బేస్డ్ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత ఐటీ నిపుణులకు లాభం

భారత ఐటీ నిపుణులకు లాభం

ట్రంప్ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే హెచ్1బీ వీసాతో అమెరికా వెళ్లి గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత ఐటీ నిపుణులకు మేలు జరగనుంది. 2018 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 70శాతం మంది భారతీయులు హెచ్1బీ వీసాలు పొందారు. వీరిలో మెజార్టీ శాతం మంది గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. అమెరికాలో 2015-17 మధ్య కాలంలో 57వేల నుంచి 62వేల మంది భారతీయులు గ్రీన్ కార్డులు పొందడం విశేషం.

English summary
U.S. President Donald Trump announced a proposal that will include significant changes to the way green cards are allocated, by dramatically reducing the number of family-based green cards and moving towards a merit-based system that will reward, among other factors, education, skills and English language proficiency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X