వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందులో.. హిల్లరీ క్లింటన్‌ను దాటేసిన డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నే ఎక్కువ మంది సెర్చింజన్ గూగుల్‌లో వెతికారు. ఫ్లోరిడా, మిచిగాన్ సహా 38 రాష్ట్రాల్లో ట్రంప్ కోసం ఎక్కువగా వెతికారు. ఓ వైపు అధ్యక్ష ఎన్నికలు సాగుతున్నాయి.

సర్వేల్లో హిల్లరీ ముందంజలో ఉన్నారు. కానీ జనాలు వెతికిన వారిలో మాత్రం హిల్లరీని ట్రంప్ బీట్ చేశారు. దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

donald trump

ఎక్కువ మంది ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మాట్లాడిన వలసదారులు, గర్భస్రావం, జాతి, ఐసిస్, ఆర్థిక వ్యవస్థ గురించి నెటిజన్లు తెలుసుకున్న వాటిలో టాప్‌ ఐదు జాబితాలో ఉన్నట్లు సోషల్ మీడియా నిపుణుడు జాసన్‌ మోలికా వెల్లడించారు.

2012 ఎన్నికల సమయంలో ఎక్కువ మంది ప్రజలు 'ఎలా ఓటు వేయాలి' అని సెర్చ్ చేశారు. ఈ ఏడాది ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ఎక్కడ ఓటు వేయాలి' అనే దానిని వెతికారు.

అమెరికా ఎన్నికలు సందర్భంగా గూగుల్‌ 'ఓట్‌' అని ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఓట్‌ అనే డూడుల్‌ వివిధ భాషల్లో కనిపిస్తుంది. నెటిజన్లు డూడుల్‌పై క్లిక్‌ చేస్తే వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడంతో పాటు, దగ్గర్లో ఉన్న పోలింగ్‌ స్టేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.

English summary
Data released by search engine giant Google shows that Trump is leading in terms of searches in at least 38 states, including in the battleground states of Florida and Michigan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X