వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఎఫెక్ట్: గోడకు మూడున్నరేళ్లు, రూ.1748 కోట్ల ఖర్చు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పొరుగుదేశం మెక్సికో పొడవునా సరిహద్దు వెంబడి గోడ నిర్మాణానికి కసరత్తు మొదలైంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పొరుగుదేశం మెక్సికో పొడవునా సరిహద్దు వెంబడి గోడ నిర్మాణానికి కసరత్తు మొదలైంది. దీని నిర్మాణానికి మూడున్నరేళ్లు పడుతుందని అధికారులు అంచనా వేశారు.

అంతే కాదు రూ.1748,63,64,24,000 (21.6 బిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అధికారికంగా అంచనా వేశామని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ శాఖ అంతర్గత నివేదికలో తేలింది. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఖర్చు చేసిన 12 బిలియన్ల డాలర్ల కంటే ఇది చాలా ఎక్కువ.

హోంలాండ్ భద్రతాశాఖ మంత్రి జాన్ కెల్లి త్వరలో అధ్యక్షుడు ట్రంప్‌కు సమర్పిస్తారని తెలుస్తున్నది. మూడు దశల్లో రెండువేల కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణం చేపట్టేందుకు 2020 వరకు సమయం పడుతుందని జాన్ కెల్లీ నివేదించనున్నట్లు సమాచారం.

Donald Trump

మూడు దశల్లో గోడ నిర్మాణానికి ప్రణాళికలు

ఇప్పటికే 654 మైళ్ల (1046 కిలోమీటర్ల విస్తీర్ణం) పరిధిలో సరిహద్దుల్లో రక్షణ ఏర్పాటైంది. అయితే కొత్తగా సరిహద్దు పొడవునా గోడ నిర్మాణానికి కసరత్తు సాగుతోంది. దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారం చేపడుతున్నప్పటి నుంచి రోడ్డు నిర్మాణం, అందుకు అవసరమైన కసరత్తు, అంచనాలు వేయడం ప్రారంభమైంది. నివేదిక సమర్పించకముందే.. విధి విధానాలు ఖరారు కాకముందే ముందే స్పందించడం సరి కాదని హోంల్యాండ్ సెక్యూటరీ శాఖ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ఈ దశలో స్పందించడం తొందరపాటవుతందన్నారు. మూడు దశల్లో ఈ సరిహద్దు గోడ నిర్మాణం పూర్తవుతుంది. వచ్చే ఏప్రిల్, మే నెలాఖరు వరకు గానీ రోడ్డు నిర్మాణానికి నిధులు లభిస్తాయని భావిస్తున్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి సరిహద్దు గోడ నిర్మాణానికి కాంట్రాక్ట్ సంస్థ ఖరారు అవుతుందని అధికార వర్గాల అంచనా.

నిధుల కేటాయింపునకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి

గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపునకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. గోడ నిర్మాణానికి అయ్యే ఖర్చు మెక్సికో చెల్లించిన తర్వాత దాన్ని తిరిగి ఖజానాకు చేరుస్తారు. కానీ గోడ నిర్మాణానికి అయ్యే ఖర్చు చెల్లించేందుకు ఇప్పటికే మెక్సికో నిరాకరించింది. దీంతో మెక్సికో నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ భారీగా పన్నులు విధించారు. ఈ నేపథ్యంలో పలు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బ్రుందాలు మెక్సికో సరిహద్దులను సందర్శించాయి. గోడ నిర్మాణానికి అవసరమైన నిధులెంత? ఎంతకాలంలో పూర్తవుతుంది? అన్న అంశాలను పరిశీలించేందుకు అధ్యయనాలు జరిపారు.

గోడ డిజైన్ రూపకల్పనపై ఫోకస్

గోడ నిర్మాణ ప్రాంతంలో పలుచోట్ల పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నది. ఈ విషయమై కూడా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నది. ఇఫ్పటికే ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు, ఈ గోడ నిర్మాణానికి అవసరమైన స్టీల్ కొనుగోలుపై ద్రుష్టిని కేంద్రీకరించింది. ప్రస్తుతం నిర్మించనున్న గోడ డిజైన్ రూపొందిస్తున్నామని అమెరికా లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి ఒకరు తెలిపారు. గోడ నిర్మాణానికి అవసరమైన ప్రయివేట్ భూ సేకరణకు సమయం పడుతుందని, ఖర్చు కూడా భారీగానే అవుతుందని తెలిపారు.

ట్రంప్ అంచనాల కంటే ఖర్చు ఎక్కువే

అధ్యక్షుడు ట్రంప్, అమెరికా కాంగ్రెస్ సభ్యుల అంచనాల కంటే ఇది ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బెర్న్‌స్టిన్ రీసెర్చ్ అనే అధ్యయనం సంస్థ మాత్రం ఈ గోడ నిర్మాణం వ్యయం 25 బిలియన్ డాలర్ల వరకు వెళ్లొచ్చని అంచనా వేసింది. రియో గ్రనేడ్ వ్యాలీ పరిధిలోని లారెడో, టెక్సాస్, టక్స‌న్, అరిజోనా, ఎల్ పాస్, బిగ్ బెండ్ మీదుగా 241 కిలో మీటర్ల పొడవునా గోడ నిర్మాణానికి రెండోదశ ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. మూడోదశ గోడ నిర్మాణం 1728 కిలోమీటర్ల మేర ఉంటుందని చెప్తున్నారు. ప్రత్యేకించి అమెరికా - మెక్సికో సరిహద్దును పూర్తిగా మూసివేస్తుందని అంచనా.

ఇవీ అడ్డంకులు.. అవరోధాలు

సరిహద్దు వెంబడి గోడ నిర్మాణానికి పలు అడ్డంకులు ఉన్నాయి. స్థల పరిమితులు, కొన్ని చోట్ల పర్వత శ్రేణులు అడ్డు రావడం గోడ నిర్మాణానికి ఆటంకాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తిగా విజయవంతం చేసేందుకు ప్రైవేట్ భూమి సేకరించాలని, అందుకు హోం లాండ్ సెక్యూరిటీ శాఖ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. తొలి దశలో 360 మిలియన్ల డాలర్లు మాత్రమే ఖర్చవుతుందని ఒక అంచనా. చట్ట విరుద్ద వలసల నియంత్రిస్తానని తన మద్దతుదారులకు ఇచ్చిన హామీ నిలుపుకుని వారిని సంత్రుప్తి పరిచేందుకు ట్రంప్ ఆసక్తిగా ఉన్నారు. కానీ గోడ నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎత్తైన ప్రదేశాలకు తోడు ప్రైవేట్ స్థలాల సేకరణ, రోడ్డు వరకు చేరుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు.

మెక్సికోతో జలాల పంపిణీ సంగతేమిటి?

అంతర్జాతీయ సరిహద్దు, జల కమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రముఖంగా హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య జలాల పంపిణీపై ద్వైపాక్షిక ఒప్పందం కూడా ఉన్నది. ఒక్కో ప్రాంతంలో సరిహద్దు గోడ నిర్మాణానికి మైలుకు 11 మిలియన్ల డాలర్ల నుంచి 15 మిలియన్ల డాలర్ల వరకు ఖర్చవుతుందని అంచనా.

English summary
President Donald Trump’s “wall” along the U.S.-Mexico border would be a series of fences and walls that would cost as much as $21.6 billion, and take more than three years to construct, based on a U.S. Department of Homeland Security internal report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X