వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయులకు దెబ్బ: H 1B వీసాల్లో పెను మార్పులు తీసుకురానున్న ట్రంప్ సర్కార్

|
Google Oneindia TeluguNews

Recommended Video

H 1B వీసాల్లో పెను మార్పులు తీసుకురానున్న ట్రంప్ సర్కార్

H 1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్రతిపాదనలు తీసుకురానున్నారు. H 1B వీసాల జారీ ప్రక్రియలో ఉపాధి నిర్వచనాన్ని మార్చనున్నారు. ఈ ప్రభావం భారతీయులపై పడనుంది. అంతేకాదు అమెరికాలో స్థిరపడిన భారతీయ అమెరికన్లు పనిచేస్తున్న ఐటీ కంపెనీలు, వారు స్థాపించిన ఐటీ రంగంలోని చిన్న మధ్య తరహా కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.

జనవరి 2019 కల్లా అమెరికా పౌరసత్వం, మరియు ఇమ్మిగ్రేషన్ విధానంపై కొత్త ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే ఇప్పటి వరకు ఉన్న నిర్వచనంలో మార్పులు చేసి కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించనుంది. అంతేకాదు ఉపాధి, ఉద్యోగి నిర్వచనాలను కూడా మార్చి తద్వారా ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత అమెరికన్లకే వచ్చేలా మార్పులు తీసుకురానుంది ట్రంప్ సర్కార్.అంతేకాదు ఇందుకు అదనంగా H 1B వీసాదారులకు వచ్చే జీతభత్యాలపై కూడా ఒక నిర్ణయం తీసుకోనుంది.

Trump to bring in major changes in H-1B visas, That will hit Indians in US

H 1B నాన్ ఇమ్మిగ్రెంట్స్‌కు సంబంధించి H 4 కలిగిన వారి భాగస్వాములకు ఉద్యోగాలు రాకుండా కొన్ని చర్యలు కూడా తీసుకునేందుకు రెగ్యులేషన్స్‌లో మార్పులు చేయనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ తెలిపింది. H 1Bకోస్ దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నందున ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రాంను ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదనలు తీసుకొస్తోంది. దీని ద్వారా లాటరీ నిర్వహణ విధానం సరళతరం అవుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ భావిస్తోంది.

English summary
The Trump administration has said it is coming out with new proposals to not only revise the definition of specialty occupations under H-1B visas, but also the definition of employment under this foreign work visa category which is popular among Indian companies.Such a move, which is part of the Unified Fall Agenda of the Trump administration will have a detrimental impact on the functioning of Indian IT companies in the US and also small and medium-sized contractual companies in the IT sector, which are mostly owned by Indian Americans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X