వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫౌచీ పనికిమాలిన సైంటిస్ట్, ఆ ఇడియట్ మాట వినుంటే 5లక్షల మంది చచ్చేవారు: ట్రంప్ ఫైర్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రస్తుత ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన నోటికి పని చెప్పే ప్రక్రియను ముమ్మరం చేశారు. దేశంలో కరోనా వైరస్ విలయానికి కారణం తాను కాదని, తప్పుడు సలహాలిచ్చిన సైంటిస్టులదేనని ట్రంప్ తిట్టిపోశారు. ప్రధానంగా, మొన్నటి వరకు వైట్ హౌజ్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా పనిచేసిన అంటువ్యాధుల నిపుణుడు, సైంటిస్ట్ ఆంటోనీ ఫౌచీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో కరోనా: అరుదైన రికార్డు - 94.9శాతంతో దేశంలోనే టాప్ - మరింత తగ్గిన కొత్త కేసులుఏపీలో కరోనా: అరుదైన రికార్డు - 94.9శాతంతో దేశంలోనే టాప్ - మరింత తగ్గిన కొత్త కేసులు

ఆంటోనీ ఫౌచీ ఓ పనికిమాలిన సైంటిస్ట్ అని ట్రంప్ నోరు పారేసుకున్నారు. ఆయనను 'ఇడియట్' అంటూ సంబోధించారు. దేశంలో కరోనా కట్టడి విషయంలో ట్రంప్ విధానాల్లో లోపాలను ఫౌచీ నిర్మొహమాటంగా ఎత్తి చూపడం తెలిసిందే. సోమవారం నాటి ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ ట్రంప్.. ఎన్నికల దృష్ట్యా ఫౌచీపై చర్యలు తీసుకోవడం లేదని, అతని సలహాలు వినిఉంటే, అమెరికాలో కొవిడ్ మరణాల సంఖ్య 5లక్షలకు పెరిగి ఉండేదని చెప్పుకొచ్చారు.

 Trump calls Fauci a disaster and seeks to reassure his team he can win

''ఫౌచీ తీరుతో జనం బాగా విసిగిపోయారు. ఏమైనా జరగనీయండి.. ఇక మమల్ని వదిలేయండని వేడుకుంటున్నారు. అలాంటి ఇడియట్స్ మాటలను వినడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఎన్నికలు ఉండటం వల్లే అతనిపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నా'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, కరోనా కట్టడిలో ట్రంప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇప్పుడా నెపాన్ని ఫౌచీపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని డెమొక్రటిక్ నేతలు అంటున్నారు.

కరోనా విలయంపై ప్రధాని మోదీ - లాక్‌డౌన్ ముగిసినా వైరస్ చావలేదు - అమెరికా కంటే మనమే బెటర్కరోనా విలయంపై ప్రధాని మోదీ - లాక్‌డౌన్ ముగిసినా వైరస్ చావలేదు - అమెరికా కంటే మనమే బెటర్

కరోనా ఉధృతిపై గతంలో తాను చెప్పిన మాటలను.. రిపబ్లికన్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికల ప్రచారలో వాడుకోవడం తగదని సైంటిస్టు ఫౌచీ అభ్యంతరం చెప్పడంతో ట్రంప్ ఈ మేరకు రెచ్చిపోయి నోరు పారేసుకున్నారు. తన 50 ఏళ్ల కెరీర్ లో ఏనాడూ రాజకీయ పార్టీల తరఫున మాట్లాడలేదని, ట్రంప్ సహా రిపబ్లికన్ నేతలు షేర్ చేస్తోన్న వీడియోలోంచి తన మాటలను తొలగించాలని ఫౌచీ డిమాండ్ చేయగా, ఆ మాటలు ట్రంప్ కు ఆగ్రహం తెప్పించాయి. కాగా,

 Trump calls Fauci a disaster and seeks to reassure his team he can win

Recommended Video

US Election 2020 : Tax Records Show Trump Maintains Chinese Bank Account | Oneindia Telugu

ఫౌచీపై ట్రంప్ కామెంట్లను రిపబ్లికన్ పార్టీకే చెందిన సెనెటర్ లామర్ అలెగ్జాండర్‌ తప్పుపట్టారు. అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 84.67లక్షలకు, మరణాల సంఖ్య 2.25లక్షలకు పెరిగాయి. ఇప్పటికీ యాక్టివ్ కేసులు 27.29లక్షలుగా ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తున్నది.

English summary
President Donald Trump called coronavirus expert Anthony Fauci a “disaster” on Monday, airing his frustration with the scientist during a call meant to reassure campaign staff he has a path to election victory on Nov. 3, despite trailing in opinion polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X