వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మద్యం తాగను: కారణం చెప్పిన ట్రంప్

తాను మద్యం తాగకపోవడానికి కారణం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మద్యానికి బానిసై తన అన్నయ్య పడిన అవస్థలు చూసిన తర్వాత ఇంకెప్పుడూ మందు తాగొద్దని నిర్ణయించుకున్నట్టు ట్రంప్ చెప్పారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తాను మద్యం తాగకపోవడానికి కారణం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మద్యానికి బానిసై తన అన్నయ్య పడిన అవస్థలు చూసిన తర్వాత ఇంకెప్పుడూ మందు తాగొద్దని నిర్ణయించుకున్నట్టు ట్రంప్ చెప్పారు.

అమెరికాలో ఒపియాడ్‌ డ్రగ్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అమెరికా ప్రభుత్వం.

Trump cites brother's struggle with alcohol in talking about addiction

ఈ సందర్భంగా శ్వేతసౌధంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మద్యం, మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్‌ భావోద్వేగ ప్రసంగం చేశారు.
'మా అన్నయ్య ఫ్రెడ్‌ ట్రంప్‌ జూనియర్‌. చాలా గొప్ప వ్యక్తి. నా కంటే చాలా అందంగా ఉండేవారు. అయితే ఆయనకు ఓ సమస్య ఉంది. ఆయన మద్యానికి బానిసయ్యారు. దాని వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నారని ట్రంప్ గుర్తుచేసుకొన్నారు.

అన్నయ్య తరచూ నాకు మద్యం తాగొద్దని చెప్పేవారు. నా కంటే పెద్దవాడు అనుభవంతో చెప్పడంతో నేను ఆయన మాటలకు గౌరవం ఇచ్చాను. ఆయన పడుతున్న కష్టాలను చూసిన తర్వాతే ఇంకెప్పుడూ మద్యం సేవించొద్దని, పొగ తాగొద్దని నిర్ణయించుకున్నాను. ఆయన 43 ఏళ్లకే చనిపోయాడు' అని ట్రంప్‌ చెప్పారు.

యువతకు డ్రగ్స్‌పైన అవగాహన కల్పించాలంటే ప్రభుత్వం చొరవ చూపించాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ప్రచార కార్యక్రమాల ద్వారా డ్రగ్స్‌ తీసుకోకుండా ఒప్పించాలని ట్రంప్ సూచించారు. మద్యం, మాదకద్రవ్యాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే జీవితాలను కోల్పోతున్నారని, ఈ పరిస్థితిని మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
President Donald Trump stood in the White House's grandly decorated East Room on Thursday afternoon and read from a teleprompter as he explained how his administration will launch "a massive advertising campaign" to tell children to never try drugs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X