వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌంటింగ్ నిలిపివేత: ట్రంప్ విజేత -కోర్టు ఉత్తర్వులపై సంచలన ట్వీట్ -కానీ నిమిషాల్లోనే కథ మొదటికి

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో గంటగంటకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికలు ముగిసిన మంగళవారం సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా.. గురువారం మధ్యాహ్నం(అమెరికా కాలమానం) నాటికి కూడా తుది ఫలితాలు వెలువడలేదు. మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ మ్యాజిక్ ఫిగర్ 270కాగా, 5 రాష్ట్రాలు మినహా 45 చోట్ల వెల్లడైన ఫలితా ప్రకారం డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ 264 ఓట్లు, రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లు సాధించారు. కౌంటింగ్ పై కోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది..

ట్రంప్ ఓడినా చరిత్రే: అత్యధిక రేటింగ్ -28ఏళ్ల తర్వాత ఆయనే -అమెరికాను వీడిపోతారా?ట్రంప్ ఓడినా చరిత్రే: అత్యధిక రేటింగ్ -28ఏళ్ల తర్వాత ఆయనే -అమెరికాను వీడిపోతారా?

బిగ్ విన్.. అంటూ ట్రంప్ సబురాలు..

బిగ్ విన్.. అంటూ ట్రంప్ సబురాలు..

కరోనా కారణంగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సగానికిపైగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్ రూపంలో రావడం, కొన్ని రాష్ట్రాల చట్టాల మేరకు మంగళవారం తర్వాతే వాటిని లెక్కించడం ఆరంభించడంతో మొత్తం ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో.. పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, ఆరిజోనా, నెవెడాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే సుదీర్ఘంగా సాగుతోన్న బ్యాలెట్ ఓట్ల లిక్కింపును వెంటనే నిలిపేయాలంటూ పలు రాష్ట్రాల్లో ట్రంప్ క్యాంపెయిన్ కోర్టులను ఆశ్రయించింది. దీనికి సంబంధించి ఫలడెల్ఫియా(పెన్సిల్వేనియా) కోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని గొప్ప విజయంగా ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆయన అనుచరులు ట్రంప్ విజేత అంటూ ప్రకటనలు చేశారు. కానీ వాస్తవం ఏంటంటే..

కోర్టు ఆదేశంతో కౌంటింగ్ నిలిపేత..

కోర్టు ఆదేశంతో కౌంటింగ్ నిలిపేత..

బిగ్ లీగల్ విన్.. అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ వాస్తవమే అయినప్పటికీ కోర్టు తీర్పు కాంటెక్స్ మాత్రం వేరు. ఫిలడెల్ఫియా సిటీలోని కౌంటింగ్ కేంద్రాల్లోకి రిపబ్లికన్ అబ్జర్వర్లను అనుమతించకపోవడంపై ట్రంప్ క్యాంపెయిన్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఉత్తర్వులిచ్చిన జడ్జి.. వారిని అనుమతించాలంటూ అధికారుల్ని ఆదేశించారు. ఆ ప్రక్రియ కోసం కొంత సేపు కౌంటింగ్ నిలిపేశారు. రిపబ్లికన్ అబ్జర్వర్లు లోపలికి వచ్చిన తర్వాత మళ్లీ కౌంటింగ్ ప్రారంభించారు. పెన్సిల్వేనియాలో ఇంకా 5.8లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. తద్వారా ముందే అనుకున్నట్లు శుక్రవారానికి గానీ ఫలితం వచ్చేలా లేదిక్కడ.

ఆ రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ

ఆ రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ

గురువారం మధ్యాహ్నం తర్వాత కూడా ఓట్ల లెక్కింపు జరుగుతోన్న ఐదు రాష్ట్రాలు.. పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, ఆరిజోనా, నెవెడాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీటిలో నెవెడా(6 ఎలక్టోరల్ ఓట్లు)లో మాత్రమే బైడెన్ ముందంజలో ఉన్నారు. ఆయన గెలుపునకు ఈ ఆరు ఓట్లు సరిపోతాయని అంతా భావిస్తున్నారు. కానీ ప్రఖ్యాత సీఎన్ఎన్ చానెల్ మాత్రం ఆరిజోనా(11 ఓట్లు) లెక్కింపులో ట్రంప్ ముందంజలో ఉన్నారని, తద్వారా బైడెన్ 253 దగ్గరే నిలిచారని అనూహ్య ప్రకటన చేసింది. మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ బైడెన్ పై ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే పోస్టల్ ఓట్లన్నీ తమకు అనుకూలంగా ఉంటాయని, చివరికి విజయం తమదేనని బైడెన్ క్యాంపెయిన్ ధీమాగా ఉంది.

ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్‌కు జైకొడుతూ..ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్‌కు జైకొడుతూ..

English summary
Donald Trump has stated that he has won Pennsylvania, The president started off with a big lead in the state, but as mail-in ballots were counted. Vote counting in Philadelphia resumed Thursday afternoon after a brief pause, according to the Pennsylvania's Philadelphia City Commissioners office
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X