వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెక్సికో గోడ నిర్మాణానికి 18 బిలియన్ డాలర్లు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా - మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం ట్రంప్ యంత్రాంగం 18 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.1.14 లక్షల కోట్లు) వెచ్చించేందుకు ప్రతిపాదనలు చేసింది.

రాన్నున్న పదేళ్లలో మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఈ మొత్తం కావాలని తెలిపింది. మెక్సికోతో గోడకు సంబంధించి అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిజ్ఞ చేసిన దానికి అనుగుణంగా బ్లూప్రింట్‌ను విడుదల చేశారు.

Trump claims Mexico will pay for wall – day after seeking $18bn from Congress

ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల సమయం నుంచే మెక్సికో సరిహద్దులో పెద్ద గోడ కడతానని చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సరిహద్దులో ఎక్కడెక్కడ, ఎలా గోడ నిర్మించాలి, ఎంత వ్యయం అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ ఏడాది 118 కిలోమీటర్ల మేర టెక్సాస్‌, కాలిఫోర్నియాల్లో గోడ నిర్మాణం లేదా ఫెన్సింగ్‌ పునర్నిర్మాణానికి ట్రంప్‌ యంత్రాంగం 1.6బిలియన్‌ డాలర్లు కావాలని కోరింది. వచ్చే ఏడాది కూడా మరో 1.6బిలియన్‌ డాలర్లు కావాలని కోరినట్లు అధికారులు తెలిపారు.

కస్టమ్స్‌, సరిహద్దు రక్షణ దళాలు సరిహద్దు రక్షణ వ్యయం కోసం 33 బిలియన్‌ డాలర్లు కావాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందులో గోడ కోసం 18 బిలియన్‌ డాలర్లు, టెక్నాలజీ కోసం 5.7బిలియన్‌ డాలర్లు, రోడ్డు నిర్మాణం నిర్వహణ కోసం ఒక బిలియన్‌ డాలర్లు, సరిహద్దులో 5000 కొత్త పెట్రోల్‌ ఏజెంట్లకు, 2500 సరిహద్దు ఇన్స్‌పెక్టర్లకు, ఇతర సిబ్బందికి కలిపి 8.5బిలియన్‌ డాలర్లు కావాలని కోరినట్లు అధికారులు తెలిపారు.

English summary
Donald Trump insisted on Saturday that Mexico would pay for a wall along the southern US border, one day after his administration asked Congress for $18bn over the next decade to start construction on the barrier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X