వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా టార్గెట్‌గా ట్రంప్ ఎత్తుగడలు- బిడెన్‌కు ఇబ్బందులు సృష్టించేందుకేనంటున్న విశ్లేషకులు

|
Google Oneindia TeluguNews

హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన గత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధాన్ని మాత్రం అంత త్వరగా వీడే సూచనలు కనిపించడం లేదు. అదే సమయంలో ఆయన వైట్‌ హౌస్‌ వీడక ముందే తన ప్రత్యర్ధి చైనాను మరింత కెలకడం ద్వారా కాబోయే దేశాధ్యక్షుడు జో బిడెన్‌కు సమస్యలు సృష్టించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచే చైనాను టార్గెట్‌ చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా ప్రస్తుత దుస్ధితికి చైనాయే కారణమంటూ ఎన్నికల్లో సైతం తీవ్రంగా ప్రచారం చేశారు. అయినా ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. అయినా చైనాను మాత్రం తుది వరకూ టార్గెట్‌ చేయాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చైనాకు వ్యతిరేకంగా సత్వర ఆదేశాలు ఇవ్వడంతో పాటు పాలనా విధానాల్లో మార్పులను ప్రస్తావించబోతున్నారు. సెనేట్‌ అనుమతి అవసరం లేని నియామకాలు సైతం చేయడం ద్వారా బీజింగ్‌ను మరింత ఇరుకున పెట్టాలని ట్రంప్‌ భావిస్తున్నారు.

trump could target china before leaving white house, say experts

చైనాకు వ్యతిరేకంగా ట్రంప్‌ కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. వీటిలో పలువురు కమ్యూనిస్టు పార్టీ కీలక నేతలకు వీసాల నిషేధం, బీజింగ్‌లో 2022లో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌లో అమెరికా క్రీడాకారులు పాల్గొనకుండా ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. చైనాపై పలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించడంతో పాటు ఇరుదేశాలూ వాడుకునే కొన్ని మిలటరీ పరికరాల ఎగుమతి, దిగుమతులపైనా నిషేధం విధిస్తారని తెలుస్తోంది. వీటి వల్ల కాబోయే అధ్యక్షుడు జో బిడెన్‌కూ, చైనాకూ మధ్య మరింత గ్యాప్‌ పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
Donald Trump is showing no signs of backing down from his White House post. After his defeat against President-elect Joe Biden, the Republican leader may double down on China in his final office months, leaving behind more diplomatic or trade tangles to untie for the Democrat, experts say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X